సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రామదూత క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం వ్యూహం. ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనలే కథాంశంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్, భారతీగా మానస నటిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆర్జీవీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
(ఇది చదవండి: వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా! )
రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..' నేను నమ్మిన నిజాన్ని సినిమాలో చూపిస్తున్నా. సినిమాల్లో నా అభిప్రాయాన్ని చెబుతున్నా. పొగడ్తలు అంటే నాకు చిరాకు. విమర్శలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా. నేను తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. వ్యూహం సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో ఎవరినీ టార్గెట్ చేయలేదు. సీఎం జగన్‌పై నాకున్న అభిప్రాయాలను మాత్రమే చూపిస్తా. అని అన్నారు.
(ఇది చదవండి: ‘వ్యూహం’ సినిమా కొనసాగింపుగా ‘శపథం’)
అనంతరం చిరంజీవి కామెంట్స్‌పై మాట్లాడుతూ..' సినిమా గురించి ఇప్పుడే అన్ని చెబితే ఆసక్తి ఉండదు. సినిమాల్లో సందేశాలు ఇచ్చే అలవాటు నాకు లేదు. చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్స్ చేశారో నాకు తెలియదు. నేను నిజానికి బట్టలిప్పి చూపిస్తా. భోళా శంకర్ సినిమా డాకుమెంట్స్ ఏవో టైంకు ఇవ్వలేదని తెలిసింది. కానీ ఆ వివరాలు పూర్తిగా నాకు తెలియదు. రెమ్యూనరేషన్ అనేది ఇచ్చేవాడి ఇష్టం. తీసుకునే వాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మార్కెట్‌ను బట్టి ఇస్తారు. నన్ను ఎవరూ ప్రలోభ పెట్టలేదు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నాం. ' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment