హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్' భారతదేశంలో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జులై 21 న విడుదలైంది. 'అణుబాంబు పితామహుడు' అని పిలువబడే వ్యక్తి J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ బయోపిక్ కావడంతో భారీ అంచనాలతోనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నోలన్ క్రియేటివిటీ అద్భుతంగా ఉన్నా.. భారతీయుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది.
(ఇదీ చదవండి: 'కల్కి' టైటిల్ రిలీజ్‌కు ఎందుకు రాలేదంటే: అమితాబ్)
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అప్పట్లో చెప్పారు. ఈ వ్యాఖ్యాన్ని కూడా సినిమాలో చూపించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఒక సన్నివేశం మాత్రం కొంతమంది భారతీయ సినీ ప్రేక్షకులను కలవరపరిచింది. అశ్లీల సన్నివేశంలో భగవద్గీత ప్రస్తావన తీసుకురావడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
అంతేకాకుండా సినిమాను నిషేధించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సమాచార ప్రసార (ఐబి) మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ సీన్‌కు అభ్యంతరం చెప్పకుండా ఎలా సెన్సార్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. దీంతో తాజాగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై స్పందించింది. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించాలని 'ఓపెన్‌హైమర్' టీమ్‌ను కోరింది. దీంతో నేటి నుంచి ఆ సన్నివేశాన్ని తొలిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment