సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘2.ఓ’ | Rajinikanth Shankar 2Point0 Censor Completed | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 24 2018 10:40 AM | Last Updated on Sat, Nov 24 2018 10:40 AM

Rajinikanth Shankar 2Point0 Censor Completed - Sakshi

ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో 2.ఓ ఫీవర్‌ కనిపిస్తోంది. రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ లాంటి టాప్‌ స్టార్స్‌తో శంకర్‌ తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్‌ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ కూడా పూర్తి చేసుకుంది.

తాజాగా 2.ఓ తెలుగు వర్షన్‌ సెన్సార్‌ కూడా పూర్తయ్యింది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. భారీ గ్రాఫిక్స్‌ తో తెరకెక్కిన ఈ సినిమా రన్‌ టైం 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్‌ చేశారు. రజనీ సరసన బిట్రీష్ బ్యూటీ అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయక పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement