ఓటీటీకి కూడా సెన్సార్‌ | Govt lens on digital news and OTT platforms | Sakshi
Sakshi News home page

ఓటీటీకి కూడా సెన్సార్‌

Published Thu, Nov 12 2020 1:05 AM | Last Updated on Thu, Nov 12 2020 1:05 AM

Govt lens on digital news and OTT platforms - Sakshi

సాధారణంగా సినిమాలైతే సెన్సార్‌ అవ్వకపోతే విడుదల చేయలేరు. సినిమా తయారైన తర్వాత ఎవరెవరు ఆ సినిమా వీక్షించవచ్చో సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇస్తుంది. అయితే ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, అమేజాన్‌ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, జీ5 మొదలైనవి) ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్‌ లేదు. కానీ ఇకనుంచి ఓటీటీ కంటెంట్‌కి కూడా కత్తెర తప్పదని సమాచార మరియు ప్రసారశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక పై ఆన్‌లైన్‌లో ప్రసారమయ్యే కంటెంట్‌ కూడా ప్రభుత్వం గమనిస్తుంటుందని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని డిజిటల్‌ మాధ్యమాల్లో సినిమా, సిరీస్‌లు, వెబ్‌సిరీస్‌లు చేస్తున్న పలువురు దర్శక–నిర్మాతలు వ్యతిరేకించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement