త్వరలో జపాన్‌లో ‘బాహుబలి 2’ రిలీజ్‌ | Baahubali 2 Japan Release Updates | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 12 2017 11:48 AM | Last Updated on Tue, Dec 12 2017 2:13 PM

Baahubali 2 Japan Release Updates - Sakshi

దేశ వ్యాప‍్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సత్తా చాటిన ఈ భారీ చిత్రం త్వరలో ఓవర్ సీస్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీ వసూళ్లు సాధించగా ముందు ముందు మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్.

ఈ నెల 29న బాహుబలి 2 జపాన్ లో భారీగా రిలీజ్ అవుతోంది. జపనీస్ భాషలో డబ్ చేసి భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు జపాన్ సెన్సార్ బోర్డ్ ‘జీ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మన సెన్సార్ బోర్డ్ అందించే క్లీన్ యు సర్టిఫికేట్ కు ఇది సమానం. త్వరలోనే కొరియా, చైనా తో పాటు ఇతర ఆసియా దేశాల్లో బాహుబలి 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement