Vijay Devarakonda Liger Movie Completes Censor Work Gets UA Certificate - Sakshi
Sakshi News home page

Liger Movie: ‘లైగర్‌’ సెన్సార్‌ పూర్తి? థియేట్రికల్‌ రన్‌టైం ఎంతంటే..!

Published Fri, Aug 5 2022 8:02 PM | Last Updated on Fri, Aug 5 2022 8:28 PM

Vijay Devarakonda Liger Movie Completes Censor Work Gets UA Certificate - Sakshi

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం లైగర్‌. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిచన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే మూవీ టీజర్‌, ట్రైలర్‌, పాటలను రిలీజ్‌ చేయగా వాటికి విశేషమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ వర్క్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్‌ ఫొటోతో రచ్చ

సెన్సార్ బోర్డ్ ప్రకారం లైగర్ చిత్రం దాదాపు 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, పాటలతోపాటు.. మూవీలోని మరిన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోనున్నాయంటున్నారు. బాక్సర్‌గా విజయ్ అదరగొట్టాడని, అతడి మాస్‌ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా కాకుండ ఉండలేరట.  విజయ్‌ తల్లిగా రమ్యకృష్ణ పాత్ర స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనుందట. అంతేకాదు ఇందులోని ప్రతి పాత్ర ఆడియన్స్‌ను మెప్పిస్తుందంటున్నారు. ఈ సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు వారు లైగర్‌ టీంను ప్రశంసించినట్లు తెలుస్తోంది.

చదవండి: మీ మాజీ భర్త షాహిద్‌ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్‌ చూశారా?

మొత్తానికి లైగర్‌ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ ఆగస్ట్‌ 25న బాక్సాఫీసుపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. కాగా ఈ సినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మరోవైపు ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌కు పరిచయకాబోతున్నాడు. ఇప్పటికే నార్త్‌లో విజయ్‌కి వీపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. దీనికి ఇటీవల ముంబైలో మాల్‌ జరిగిన మూవీ ఈవెంట్‌యే ఉదాహరణ. మరి ఈ మూవీతో విజయ్‌ నార్త్‌ ఆడియన్స్‌ ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement