తక్షణం సెన్సార్ సరి్టఫికేట్ ఇవ్వాలని ఆదేశించలేమన్న బాంబే హైకోర్టు
ముంబై: కంగనా రనౌత్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎమర్జెన్సీ’సినిమాకు విడుదల కష్టాలు తప్పట్లేవు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీన సినిమా విడుదల కావాల్సి ఉన్నా ఇంతవరకు సినిమా సర్టిఫికేషన్ పూర్తవలేదు. తక్షణం సర్టిఫై చేయాల్సిందిగా సెన్సార్ బోర్డును ఆదేశించలేమని జస్టిస్ బీపీ కోలాబవాలా, జస్టిస్ ఫిర్దోశ్ పూనీవాలాల బాంబే హైకోర్టు ధర్మాసనం బుధవారం స్పష్టంచేసింది.
సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)ను ఆదేశించాలంటూ సినిమా నిర్మాణసంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. సినిమాలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. దీంతో సినిమాకు సరి్టఫికేట్ ఇచ్చే ముందు వీరి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ అంశాన్ని బుధవారం బాంబే హైకోర్టు ప్రస్తావించింది.
‘సర్టిఫికేషన్ అంశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలిచి్చంది. ఆ ఉత్తర్వులు లేకపోయి ఉంటే ఈరోజే సరి్టఫై చేయాలని సీబీఎఫ్‌సీని ఆదేశించేవాళ్లం. ఈ దశలో మేం కలుగజేసుకోవడం సబబు కాదు. అందుకే తక్షణం సర్టిఫై చేయాలని ఆదేశించలేం. అయితే సినిమాపై వస్తున్న అభ్యంతరాలపై ఈనెల 18లోపు సీబీఎఫ్‌సీ నిర్ణయం తీసుకోవాలి’అని హైకోర్టు సూచించింది. సినిమాకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో కంగన అసహనంతో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్‌బోర్డు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్వయంగా బాంబే హైకోర్టే చెబుతోంది’అని కంగన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment