'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్ | Vijay Devarakonda's First Reaction On Kushi Movie Review - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Kushi Movie: మొత్తానికి సాధించాం.. విజయ్ ట్వీట్ వైరల్!

Published Fri, Sep 1 2023 12:42 PM | Last Updated on Fri, Sep 1 2023 12:57 PM

Kushi Movie Review Vijay Devarakonda First Reaction - Sakshi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఖుషి' థియేటర్లలోకి వచ్చేసింది. గతేడాది రిలీజైన 'లైగర్' బోల్తా కొట్టడంతో.. ఈ మూవీపై విజయ్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. పెద్దగా హడావుడి లేకుండా చాలా ధీమాగా ఉంటూ వచ్చాడు. అందుకు తగ్గట్లే సినిమాకు చాలావరకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్.. మూవీ రిజల్ట్ పై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేశాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!)

'ఖుషి' కథేంటి?
విప్లవ్(విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. కావాలని మరీ కశ్మీర్ లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడే ఆరా బేగం(సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా ఇతడిని ప్రేమిస్తుంది. కట్ చేస్తే.. తాను ముస్లిం కాదని హిందూ అని చెబుతుంది. తన తండ్రి, కుటుంబం వివరాలు చెబుతుంది. అయితే పెద్దల దగ్గరకు తమ ప్రేమ విషయం తీసుకెళ్తే.. వాళ్లు తమ పెళ్లికి ససేమిరా అంటారు. కానీ విప్లవ్, ఆరాధ్య ఒక్కటవుతారు. ఆ తర్వాత ఏమైంది? వీళ్ల సంసారం ఎలా సాగిందనేదే స్టోరీ.

విజయ్ ఏమన్నాడు?
అయితే ఓవర్సీస్ లో 'ఖుషి' ప్రీమియర్స్ భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి పడ్డాయి. ఈ క్రమంలోనే ఉదయం లేచేసరికే విజయ్ కి బోలెడన్ని కాల్స్, మెసేజులు వచ్చాయి. దీంతో ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు. 'నాతో పాటు మీరు ఐదేళ్లుగదా ఎదురుచూశారు. నాకోసం ఎంతో సహనంగా వెయిట్ చేశారు. మొత్తానికి ఈ రోజు సాధించాం. వందల ఫోన్లు, మెసేజులతో నిద్రలేచాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. లవ్ యూ ఆల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి సినిమాను ఎంజాయ్ చేయండి. మీరు వెళ్తారని తెలుసు. మీ మనిషి విజయ్ దేవరకొండ' అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement