అర్ధరాత్రి సమంతకు వీడియో కాల్‌ చేసిన విజయ్‌.. ఎందుకంటే? | Kushi Movie Promotions: Samantha And Vijay Devarakonda Video Call Clip Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Samantha And Vijay Devarakonda Video Call: అర్ధరాత్రి సమంతకు వీడియో కాల్‌ చేసిన విజయ్‌.. పసిగట్టేసిన ఫ్యాన్స్‌

Published Mon, Aug 28 2023 11:49 AM | Last Updated on Mon, Aug 28 2023 1:12 PM

Kushi Movie Promotion: Samantha, Vijay Devarakonda Video Call - Sakshi

సినిమా రిలీజ్‌ దగ్గరపడుతోంది. ఏదో ఒకటి చేసేయాలి. ఎలాగోలా బజ్‌ తీసుకురావాలి. జనాలను థియేటర్‌కు రప్పించాలి.. ఇది అందరూ అనుకునేదే! కానీ ఖుషి టీమ్‌ అలా అనుకుని వదిలేయలేదు. ఓ వెరైటీ కాన్సెప్ట్‌తో విభిన్నంగా ప్రమోషన్‌ చేసింది. ఇంతకీ ఏం చేసిందంటారా? మరేం లేదు... ఖుషి సినిమా హీరోహీరోయిన్స్‌.. విజయ్‌ దేవరకొండ, సమంత అర్ధరాత్రి వీడియో కాల్‌ మాట్లాడుకున్నారు. 

అర్ధరాత్రి సామ్‌కు వీడియోకాల్‌
అర్ధరాత్రి సామ్‌కు ఫోన్‌ చేశాడు విజయ్‌. ఏమైంది.. ఈ టైంలో ఫోన్‌ చేశావ్‌, అంతా ఓకేనా అని యోగక్షేమాలు అడిగింది సామ్‌. దీనికి రౌడీ హీరో.. మరేం లేదు, నిన్ను మిస్‌ అవుతున్నాను, నీకో జోక్‌ చెప్పనా అన్నాడు. అర్ధరాత్రి 1.30 అవుతోంది.. ఈ సమయంలో జోక్‌ ఏంటి? అంటూనే సరే చెప్పమంది. నాక్‌.. నాక్‌.. దేర్‌ అనగా అక్కడ ఎవరున్నారని? అంది సామ్‌. దీంతో విజయ్‌ నా.. అని హింటిచ్చాడు. అర్థం కాని సామ్‌ ఎవరు? అని అడగడంతో హీరో పాటందుకున్నాడు.. నా రోజా నువ్వే.. నా దిల్‌సే నువ్వే.. నా అంజి నువ్వే.. గీతాంజలి నువ్వే అని పాడటంతో సమంత మనసారా నవ్వేసింది. ఈ వీడియోను విజయ్‌, సమంత ఇద్దరూ తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు.

పసిగట్టేసిన ఫ్యాన్స్‌
కాన్సెప్ట్‌ బానే ఉంది.. కానీ సమంత పెట్టుకున్న కళ్లజోడులో తను వీడియోకాల్‌ చేయలేదని స్పష్టంగా తెలిసిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. బిగినర్స్‌ మిస్టేక్‌ ఇవన్నీ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఆ నా.. మరెవరో కాదు నాగచైతన్య అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలా వీడియో కాల్స్‌ మాట్లాడుకుంటే రష్మిక ఏమైపోవాలి అని మరో వర్గం జోక్స్‌ పేలుస్తోంది. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement