కరోనా ఎఫెక్ట్‌: ముద్దు సీన్లు కట్‌! | Corona Effect: Taiwanese TV Serials Cut Kissing Scenes | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌: ముద్దు సీన్లు కట్‌!

Feb 9 2020 8:38 PM | Updated on Feb 9 2020 8:46 PM

Corona Effect: Taiwanese TV Serials Cut Kissing Scenes - Sakshi

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ చైనాను కుదిపేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 800 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాయి. అయితే ఈ ప్రభావం పలు దేశాల సినీ ఇండస్ట్రీపై కూడా పడింది. చైనాలో ఇప్పటికే సినిమా, సీరియల్‌ వంటి షూటింగ్‌ల అనుమతులను నిలిపివేసింది. అయితే కరోనా వైరస్‌ అంతగా ప్రభావం లేని తైవాన్‌ దేశం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 

ఇందులో భాగంగా అక్కడి టీవీ స్టేషన్స్‌ దర్శకనిర్మాతలకు పలు సూచనలు చేసింది. నటీనటులు కరోనాతో పాటు మరే వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు లిప్‌ లాక్‌ సీన్స్‌ లేకుండా షూటింగ్‌ జరపాలని కోరినట్లు అక్కడి స్థానిక మీడియా ప్రచురించింది. అంతేకాకుండా లిప్‌ లాక్‌ సీన్స్‌ ప్రభావం ప్రజలపై పడకుండా సీరియల్స్‌, సినిమాల్లో ముద్దు సన్నివేశాలను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులను రద్దు చేసింది. కాగా, నటీనటులు ఏదైనా వైరస్‌ బారిన పడినా, అనారోగ్యంగా ఉన్నా ముద్దు సన్నివేశాల్లో పాల్గొనొద్దని ఇప్పటికే సింగపూర్‌ ఆరోగ్య శాఖ అక్కడి సినీ ఇండస్ట్రీకి సూచించింది. అంతేకాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. 

చదవండి:
811కి చేరిన కరోనా మృతుల సంఖ్య
కూతురికి గాల్లో హగ్‌ ఇచ్చిన నర్సు..
ఆకలితో చావాల్సి వస్తుంది, అందుకే ఇలా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement