ముద్దు రద్దును వెనక్కి తీసుకున్న నటి!
‘‘పెళ్లయ్యాక నటన పరంగా కొన్ని హద్దులు పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే నేను, మా ఆయన సైఫ్ అలీఖాన్ ముద్దు సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా కపూర్ పేర్కొన్నారు. కానీ, ముద్దు రద్దు అనే మాటను వెనక్కి తీసుకుని, అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ సీన్‌లో నటించారామె. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కి అండ్ క’. ఇందులో కబీర్ అనే యువకుడిగా అర్జున్ కపూర్, కియా అనే యువతిగా కరీనా నటించారు.
వీళ్ల పాత్రల పేర్లలోంచి ‘కి’, ‘క’ని తీసుకుని ‘కి అండ్ క’ అని పెట్టారు. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధం చుట్టూ సాగుతుంది. కథానుసారం లిప్ లాక్ ఉంటేనే బాగుంటుందని భావించిన కరీనా నటించారు. అర్జున్, కరీనాల లిప్ లాక్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు.