మరీ ఇంత ఘాటు ముద్దా?.. హీరోయిన్‌ ఆగ్రహం | Komali Heroshini Slams Director Over Lip Lock Scene | Sakshi
Sakshi News home page

మరీ ఇంత ఘాటు ముద్దా?.. హీరోయిన్‌ ఆగ్రహం

Published Tue, Jan 28 2020 1:24 PM | Last Updated on Tue, Jan 28 2020 1:24 PM

Komali Heroshini Slams Director Over Lip Lock Scene - Sakshi

లిప్‌లాక్‌కు ఒప్పుకున్నాను కానీ మరీ ఇంత ఘాటు ముద్దా.. అంటూ నవ కథానాయకి దర్శకుడిపై మండిపడి షూటింగ్‌ నుంచే వెళ్లిపోయిన సంఘటన ఉట్రాన్‌ చిత్రంలో చోటు చేసుకుంది. సాట్‌ సినిమాస్‌ పతాకంపై రూపొందిన చిత్రం ఉట్రాన్‌. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 31వ తేదీన విడుదలకు సిద్ధమైంది. రోషన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి హిరోషిణి  హీరోయిన్‌గా నటించింది.  మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పాపులర్‌ అయిన హిరోషిణి  హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ఇది. రాజా గజనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశం వివాదంగా మారింది. 

దీనిపై చిత్ర వర్గాలు మాట్లాడుతూ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య లిప్‌లాక్‌ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారని తెలిపారు. ఆ సన్నివేశానికి దర్శకుడు కట్‌ చెప్పిన తరువాత హీరోయిన్‌ ఆగ్రహంతో దర్శకుడి వద్దకు వచ్చి మీరు కథ చెప్పినప్పుడు లిప్‌లాక్‌ సన్నివేశం ఉంటుందనే చెప్పారని, అందుకే తాను ఓకే చెప్పానని అంది. ఇప్పుడు హీరో స్మూచ్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేసిందన్నారు. అయితే హీరోయిన్‌ చెప్పింది దర్శకుడికి అర్థంగాక అయోమయంలో పడడంతో హీరోయిన్‌ తనే ముద్దు గురించి వివరించిందన్నారు. లిప్‌లాక్‌ అంటే పెదాలపై చుంభించడం అనీ, స్మూచ్‌ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అనీ, హీరో అదే చేస్తున్నారని చెప్పిందన్నారు. హీరో కల్పించుకుని ఈ సారి కరెక్ట్‌గా లిప్‌లాక్‌ చేస్తానని చెప్పడంతో దర్శకుడు హీరోయిన్‌కు సర్దిచెప్పి నటింపజేశారన్నారు. 

హీరో మళ్లీ స్మూచ్‌ కిస్‌ ఇవ్వడంతో మండిపడ్డ నటి హిరోషిణి  షూటింగ్‌ స్పాట్‌ నుంచి వెళ్లిపోయి కార్‌వాన్‌లో కూర్చుందన్నారు. యూనిట్‌ వర్గాలు ఎంత చెప్పినా వినకుండా ఊరుకు వెళ్లిపోయిందని చెప్పారు. ముద్దుల్లో ఎన్నిరకాలు ఉంటాయో తెలియని దర్శకుడు నటి హరిరోషిణి ఇచ్చిన వివరణతో విస్మయం చెందారని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా నటి వెయిల్‌ ప్రియాంక, వేల రామమూర్తి, మధుసూదనరావ్, ఆర్‌.రవిశంకర్, జిన్నా, గానా సుధాకర్, ఒరు కన్‌ ఒరు కన్నాడీ ఫేమ్‌ మధుమిత, దర్శకుడు సరవణన్‌ శక్తి, ఇమాన్‌అన్నాచ్చి, విజయ్‌ టీవీ ఫేమ్‌ కోదండం, కాదల్‌ చిత్ర ఫేమ్‌ సరవణన్, సులక్షణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రఘునంథన్‌ సంగీతాన్ని, హాలిక్‌ ప్రభు ఛాయాగ్రహణను అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement