సీనియర్ నటికి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ | Watching 'Dangal' best birthday gift for Shabana Azmi | Sakshi
Sakshi News home page

సీనియర్ నటికి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్

Published Mon, Sep 19 2016 3:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

సీనియర్ నటికి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్

సీనియర్ నటికి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్

ముంబై: బాలీవుడ్ నటి సీనియర్ నటి షబానా అజ్మీ తన 66వ పుట్టినరోజు సందర్భంగా ‘దంగల్’ సినిమా చూసింది. షబానా పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. పుట్టినరోజున తనకు మంచి కానుక ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రధాన పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్, దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత కిరణ్ రావును ఆమె మెచ్చుకున్నారు.

‘నా పుట్టినరోజున దంగల్ సినిమా చూడడంతో మంచి బహుమతి లభించినట్టయింది. ఆమిర్‌ ఖాన్, నితేశ్ తివారి, కిరణ్ రావు, ఫతిమా, సనా చాలా బాగా నటించారు. మరిచిపోలేని కానుక ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ షబానా ట్వీట్ చేశారు. కుస్తీయోధుడు మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా ‘దంగల్’సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement