సీనియర్ నటికి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్
ముంబై: బాలీవుడ్ నటి సీనియర్ నటి షబానా అజ్మీ తన 66వ పుట్టినరోజు సందర్భంగా ‘దంగల్’ సినిమా చూసింది. షబానా పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. పుట్టినరోజున తనకు మంచి కానుక ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రధాన పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్, దర్శకుడు నితేశ్ తివారి, నిర్మాత కిరణ్ రావును ఆమె మెచ్చుకున్నారు.
‘నా పుట్టినరోజున దంగల్ సినిమా చూడడంతో మంచి బహుమతి లభించినట్టయింది. ఆమిర్ ఖాన్, నితేశ్ తివారి, కిరణ్ రావు, ఫతిమా, సనా చాలా బాగా నటించారు. మరిచిపోలేని కానుక ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ షబానా ట్వీట్ చేశారు. కుస్తీయోధుడు మహవీర్ సింగ్ పొగట్ జీవిత కథ ఆధారంగా ‘దంగల్’సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Watching #Dangal is d best birthday gift I could get. Thanku @aamir_khan nitesh tiwari kiran rao fatima sana u r outstanding
— Azmi Shabana (@AzmiShabana) 19 September 2016