రెండు రోజుల క్రితం రిలీజైన బాలీవుడ్ సినిమా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానిలో ఓ సీన్ సెన్సేషనల్ అవుతోంది. 87 ఏళ్ల వయసున్న స్టార్ నటుడు ధర్మేంద్ర, 72 ఏళ్ల వయసున్న నటి షబానా అజ్మీ లిప్‌లాక్ సీన్‌లో నటించారు. ఇది సినీప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. అయితే నటనపరంగా అదేమీ తప్పు కాదని వెనకేసుకొస్తున్నారీ సీనియర్ స్టార్స్. తాజాగా షబానా అజ్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
చప్పట్లే అని చెప్పి తీరా సమయానికి
'పర్వరీశ్ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది.. కమల్ మాస్టర్ కొరియోగ్రాఫర్.. రిహార్సల్స్ చేద్దామని నేను, అవసరం లేదని ఆయన.. నువ్వు జస్ట్ చప్పట్లు కొడితే సరిపోతుందన్నాడు. బెరుకుగానే సరేనన్నాను. తీరా సెట్‌లోకి వెళ్లాక రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని డ్యాన్స్ చేయమన్నారు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే అప్పటికే నీతూ సింగ్ రెండుసార్లు ప్రాక్టీస్ చేసి వచ్చింది. నేనేమో చేయలేదాయే! ఏ స్టెప్పుకు ఏ కాలు ముందు వేయాలి? ఏ కాలు వెనక్కు వేయాలి? అనేది అర్థమవక అయోమయానికి లోనయ్యాను.
అందరిముందు ఎగతాళి
మరీ కఠినమైన స్టెప్పులు కాకుండా సులువైన స్టెప్పులు చెప్పమని అడిగాను. అందుకా కొరియోగ్రాఫర్.. సరే, లైట్స్ ఆఫ్ చేయండి.. ఇప్పుడు నాకు షబానా గారే స్టెప్స్ నేర్పిస్తారు అని వెటకారం చేశాడు. అక్కడ సెట్‌లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లందరి ముందు నన్ను ఎగతాళి చేశాడు. చాలా బాధేసింది. సెట్‌లో నుంచి ఉన్నపళంగా వెళ్లిపోయాను. కాస్ట్యూమ్ కూడా మార్చుకోకుండానే బయటకు వెళ్లి నా కారు కోసం వెతికాను. కారు కనిపించకపోవడంతో జుహూలో ఉన్న నా ఇంటికి నడిరోడ్డుపై ఏడ్చుకుంటూ కాలినడకన వెళ్లిపోయాను.
సినిమాలు మానేద్దామనుకున్నా
ఇక మీదట ఏ హిందీ సినిమాలోనూ నటించకూడదనుకున్నాను. ఇంతటి అవమానాన్ని భరించడం నా వల్ల కాదు. ఈ అవమానాలు నేను పడలేను అని బాధపడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఆ తర్వాత డైరెక్టర్ మన్మోహన్ దేశాయ్ జరిగిన సంఘటనకు బాధ్యత వహిస్తూ సారీ చెప్పాడు. అయినా సరే ఇప్పటికీ డ్యాన్స్ చేయాలంటే నాకు అదే సంఘటన గుర్తొచ్చి ఎంతో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్, భయం ఏకకాలంలో వస్తాయి' అని చెప్పుకొచ్చింది షబానా. కాగా పర్వరీశ్ చిత్రం 1977లో విడుదలైంది. ఇందులో షబానా అజ్మీతో పాటు అమితాబ్ బచ్చన్, నీతూ సింగ్, షమ్మీ కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.
చదవండి: పెళ్లయిన 18 ఏళ్లకు బాలీవుడ్ నటుడు విడాకులు
తొమ్మిదో నెల గర్భంతో లహరి.. మరికొద్దిరోజుల్లో డెలివరీ
Comments
Please login to add a commentAdd a comment