ఆమె కంటే నేనేం తక్కువ? నిలదీసిన హీరోయిన్‌ | What Does Rekha Have That I Do Not?: Shabana Azmi Questioned Mira Nair | Sakshi
Sakshi News home page

ఆమె కంటే నేను ఎందులో తక్కువ? నాతో సినిమాలు చేయవా? వాష్‌రూమ్‌లో గొడవ..

Published Fri, Jun 21 2024 1:25 PM | Last Updated on Fri, Jun 21 2024 3:02 PM

What does Rekha Have That I Do Not?: Shabana Azmi Questioned Mira Nair

ఫలానా హీరోతో పని చేయాలని దర్శకనిర్మాతలు కలలు కన్నట్లే ఫలానా ఫిలిం మేకర్స్‌తో పని చేస్తే బాగుండని హీరో హీరోయిన్లు కూడా అనుకుంటారు. అదే విధంగా దర్శకనిర్మాత మీరా నాయర్‌ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తహతహలాడింది సీనియర్‌ కథానాయిక షబానా అజ్మీ. కానీ ఆమె కోరిక నెరవేరనేలేదు.

రేఖ, షబానా అజ్మీ

మీరా డైరెక్ట్‌ చేసిన 'ద రెలక్టెంట్‌ ఫండమెంటలిస్ట్‌'(2012) అనే సినిమాలో కేవలం చిన్న పాత్ర వరించింది. ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ ఇస్తుందనుకుంటే ఏదో చిన్న పాత్ర ఆఫర్‌ చేసిందని బాధపడింది. దర్శకురాలికి తన మీద నమ్మకమే లేదని విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాలను మీరా నాయర్‌ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. 

దర్శకనిర్మాత మీరా నాయర్‌

ఆమె మాట్లాడుతూ.. 'ముంబై జుహులోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వాష్‌రూమ్‌కు వెళ్తుంటే షబానా నా వెంటే వచ్చింది. నా కంటే రేఖ గొప్పగా చేసిందేముంది? అంటూ రెస్ట్‌ రూమ్‌లోనే గొడవపెట్టుకుంది. ఎందుకు నాకు పెద్ద రోల్‌ ఇవ్వవని నిలదీసింది. నిజంగానే ద రెలక్టెంట్‌.. సినిమాలో షబానాకు ఇచ్చిన పాత్ర చాలా చిన్నది.. మరో ప్రాజెక్ట్‌కు తప్పకుండా కలిసి పని చేద్దామని నచ్చజెప్తేగానీ ఊరుకోలేదు' అని మీరా నాయర్‌ పేర్కొంది. 

కాగా మీరా.. రేఖతో కలిసి కామసూత్ర: ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌ (1996) అనే సినిమా చేసింది. 2012 తర్వాత ఒకే ఒక్క సినిమా డైరెక్ట్‌ చేసిన ఆమె అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో షబానాతో సినిమా చేస్తానన్న హామీ కూడా అటకెక్కింది.

చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement