
దెబ్బతిన్న కారు, గాయపడిన షబానా అజ్మీ
ముంబై: అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీ (69) ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా, ఆమె భర్త, గీత రచయిత జావేద్ అఖ్తర్ (75) ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం డ్రైవర్ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే షబానాను నవీ ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోకిలాబెన్ ఆస్పత్రికి మార్చారు. ఆర్యోగ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. షబానా రోడ్డు ప్రమాదం తనను బాధకు గురిచేసిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను టాగ్ చేస్తూ.. ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవే దారుణంగా ఉందని, మరమ్మతు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment