Shocking: Sushant Singh Rajput Relatives Killed In Road Accident At Bihar - Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput: సుశాంత్‌ మేనల్లుడు సహా అరుగురు మృతి

Published Tue, Nov 16 2021 2:01 PM | Last Updated on Tue, Nov 16 2021 3:13 PM

Sushant Singh Rajput 6 Relatives Died In Road Accident In Bihar - Sakshi

Sushant Singh Rajput Relatives Died In Road Accident In Bihar: దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్‌ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్‌ బంధువు ఓం ప్రకాశ్‌ సింగ్‌ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్‌ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. 

వారు ప్రయాణిస్తున్న సుమో ట్రక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో మొత్తం 10మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో సుశాంత్‌  మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్‌ ఐపీఎస్‌ ఓం ప్రకాశ్‌ సింగ్‌ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు.

చదవండి: భర్త విషయంలో షాకింగ్‌ డెసిషన్‌ తీసుకున్న కాజల్‌
Bhumika Chawla: 'నా కోసం ముంబై వచ్చిన మేకర్స్‌ చాలామంది ఉన్నారు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement