హోలీ రోజు ఏం చేస్తున్నారు ?
Published Sun, Mar 16 2014 10:54 PM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంతా సోమవారం హోలీ ఆడుతున్నారు. మరి బాలీవుడ్ తారల పరిస్థితి ఏంటి ? షబానా ఆజ్మీ, మనోజ్ బాజ్‌పేయి, రాజ్‌కుమార్ రావు వంటి తారలు పండుగ జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. కొత్తతరం బ్యూటీలు పరిణీతి చోప్రా, ఆలియా భట్, నర్గిస్ ఫక్రీ వంటి వాళ్లు మాత్రం షూటింగుల వల్ల ఈ రంగుల ఉత్సవానికి దూరమవుతున్నారు. హోలీ గురించి వీళ్లంతా చెప్పే కబుర్లు ఇవిగో..
ఫర్హాన్ అఖ్తర్: కుటుంబ సభ్యులతో గడపడానికి చక్కని పండుగ ఇది!
పరిణీతి చోప్రా: ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. కాబట్టి సోమవారం కూడా పని చేయాల్సిందే.
ఆయుష్మాన్ ఖురానా: హోలీ అంటే పెద్దగా ఇష్టపడను. మా ప్రాంతంలో ‘రౌడీ హోలీ’ జరుగుతుంటుంది. పండుగ నాడు కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతాను.
ఆలియా భట్: నాకు హోలీ పండుగ లేదు. హంప్టీ శర్మ కీ దుల్హానియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాను
రాజ్‌కుమార్ రావు: కుటుంబం, స్నేహితులతో కలిసి హోలీ జరుపుకుంటున్నాను. రంగులు గుమ్మరించుకోవడం ఏమీ ఉండదు. గులాల్ చల్లుకోవడం వరకే..
షబానా ఆజ్మీ: నా పుట్టిళ్లు జానకీ కుటీర్‌లో సంప్రదాయబద్ధంగా హోలీ జరుపుకుంటాం. సినిమా, నాటక రంగాలకు చెందిన మా స్నేహితులు వస్తారు.
రిషీ కపూర్: షూటింగ్ కోసం చండీగఢ్‌లో ఉన్నాను. రెండు రోజుల సెలవు వచ్చింది. 18 రోజుల తరువాత ముంబైకి వెళ్తున్నాను. అయితే హోలీ ఆడను.
నర్గిస్ ఫక్రి: మై తేరా హీరో సినిమా ప్రచార కార్యక్రమాలతో తీరిక లేదు. కాబట్టి హోలీ ఆడే అవకాశాలు తక్కువే. వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తా.
మనోజ్ బాజ్‌పేయి: హోలీ ఆడడం ఇష్టముండదు. ఈసారి నా కూతురు బలవంతం చేస్తోంది. తప్పేలా లేదు.
రోణిత్ రాయ్: చాలా ఏళ్లుగా హోలీ జరుపుకోవడం లేదు.
మనీశ్ పాల్: వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో హోలీ ఆడుతున్నాను.
Advertisement
Advertisement