కష్టసుఖాల్నే కాదు, ఇంటిపనినీ సమంగా పంచుకుంటే భార్యాభర్తల మధ్య ఏ గొడవా ఉండదంటున్నాడు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao). మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం వస్తోంది. ఈ సందర్భంగా ప్రేమజంటలకు, పెళ్లి జంటలకు రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ (Patralekhaa) దంపతులు కొన్ని సూచనలిస్తున్నారు. ముందుగా పాత్రలేఖ మాట్లాడుతూ.. మా బంధంలో ఎవరి ఆధిపత్యం ఉండకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం.
బాగా సర్దుతాడు
చిన్నదైనా, పెద్దదైనా ప్రతీ విషయాన్ని, పనిని షేర్ చేసుకోవాలని నియమంగా పెట్టుకున్నాం. తను అన్నింటినీ చక్కగా సర్దుతాడు. ఏది ఎక్కడుందన్నది ఇట్టే చెప్పగలడు. నేను వంట చేస్తే తను పాత్రలు కడుగుతాడు. ఇలాంటి చిన్నచిన్న పనులు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఇద్దరం సమానమే అన్న భావనను మరింత పెంపొందిస్తాయి అని చెప్పుకొచ్చింది.
(చదవండి: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్)
నేను బోళ్లు తోముతా..
దీని గురించి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మా వైవాహిక జీవితంలో చిన్నచిన్న పనులు, సాయాలు కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. నా భార్య వంట చేసిన తర్వాత ఎంతో ఇష్టంగా సింక్‌లోని పాత్రలు శుభ్రం చేస్తాను. ఆమె ఇంట్లో లేనప్పుడు కూడా ఈ పనులన్నీ చేస్తాను. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడమంటే మన జీవితాల్ని సులభతరం చేసుకోవడమే! అని చెప్పుకొచ్చాడు. కాగా రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ సుమారు దశాబ్దకాలంపాటు ప్రేమించుకున్నారు. 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సిటీలైట్స్ (Citylights) మూవీ, బోస్:డెడ్/అలైవ్ వెబ్‌సిరీస్ సహా పలు ప్రాజెక్టుల్లో కలిసి పని చేశారు.
చదవండి: పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment