బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భీద్ చిత్రం మార్చి 24న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించి తనే స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమస్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే భీద్ మూవీలో రాజ్‌కుమార్‌ను చూసిన జనాలు కొందరు అతడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి నటుడు స్పందిస్తూ.. 'అలాంటిదేమీ లేదు. నేను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు. జనాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది విన్నప్పుడు నాకైతే నవ్వాగదు' అని చెప్పుకొచ్చాడు.
కాగా రాజ్‌కుమార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎత్తూపొడుగూ లేదు, నీ ముక్కు సరిగా లేదు, కనుబొమ్మలు కరెక్ట్ షేప్ లేదు.. ఇలా ఏదో ఒకటి ఎత్తి చూపుతూ అతడికి ఆఫర్లు ఇచ్చేవాళ్లు కాదు. యాక్టింగ్ తప్ప అన్నీ చూస్తున్నారేంటి? నటనా నైపుణ్యాన్ని పట్టించుకోరా? అని ఆలోచించేవాడు రాజ్‌కుమార్. తన టాలెంట్ నిరూపించుకునే ఒక్క అవకాశం కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎదురొడ్డి నిలబడ్డాడు. రామ్‌గోపాల్ వర్మ 'రన్' సినిమాతో కెరీర్ ఆరంభించి.. షాహిద్, కాయ్ పోచె, అలీఘడ్, న్యూటన్, స్త్రీ, జడ్జ్‌మెంటల్ హై క్యా, లూడో వంటి చిత్రాలతో ప్రశంసలే కాకుండా అవార్డులు సైతం అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment