రెమ్యునరేషన్‌ పెంపు.. అంత పిచ్చోడిని కాదన్న హీరో! | Rajkummar Rao Shuts Down Fee Hike Rumours After Stree 2 Success | Sakshi
Sakshi News home page

Rajkummar Rao: రూ.700 కోట్ల సినిమా.. పారితోషికం పెంపుపై హీరో ఏమన్నాడంటే?

Published Sun, Nov 24 2024 8:11 PM | Last Updated on Sun, Nov 24 2024 8:11 PM

Rajkummar Rao Shuts Down Fee Hike Rumours After Stree 2 Success

సినిమా హిట్టయిందంటే చాలు చాలామంది రెమ్యునరేషన్‌ పెంచేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావు రూ.50 కోట్లు పెట్టి తీసిన స్త్రీ 2 సినిమాతో రూ.700 కోట్లు సాధించాడు. ఇంతటి ఘన విజయం తర్వాత ఆ హీరో కూడా రేటు పెంచేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకుంటున్న పారితోషికానికి అదనంగా మరో రూ.5 కోట్లు అడుగుతున్నాడట! 

అంత తెలివితక్కువవాడిని కాదు
ఈ పుకార్లపై రాజ్‌కుమార్‌ స్పందించాడు. నా నిర్మాతలను కాల్చుకుతినేంత తెలివితక్కువవాడిని కాదు. బ్లాక్‌బస్టర్‌ సినిమా చేసినంతమాత్రాన నేనేమీ మారిపోను. డబ్బు కన్నా నాకు ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్‌, సర్‌ప్రైజింగ్‌ రోల్స్‌ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే స్త్రీ 2 సినిమాకుగానూ రాజ్‌కుమార్‌ రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా..
స్త్రీ 2 విషయానికి వస్తే.. రాజ్‌కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన హిట్‌ మూవీ స్త్రీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రం ఆగస్టు 15న విడుదలవగా.. ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లు వసూలు చేసింది. స్త్రీ 2 అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement