'మానాన్నను నవాజ్ షరీఫ్ ఆరాధించేవారట'
'మానాన్నను నవాజ్ షరీఫ్ ఆరాధించేవారట'
Published Wed, May 28 2014 2:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ ఏర్పాటు చేసిన విందులో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కలుసుకున్నారు. తన తండ్రి కైఫీ అజ్మిని నవాజ్ షరీఫ్ ఆరాధించేవారని తెలుసుకోవడం ఆనందం కలిగించిందని షబానా తెలిపారు.
బాలీవుడ్ ప్రముఖులు మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ లంటే కూడా ఇష్టమని నవాజ్ తనతో అన్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు సంయుక్తంగా చిత్రాలు నిర్మించే విషయంపై నవాజ్ షరీఫ్ తో చర్చించానని షబానా వెల్లడించారు.
అయితే ఇరుదేశాలు సంయుక్తంగా చిత్రాలను నిర్మించాడానికి షరీఫ్ కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనడానికి ఓ సందేశంతో నవాజ్ షరీఫ్ వచ్చారని షబానా ఆజ్మీ తెలిపారు.
Advertisement
Advertisement