నోయిడా: బాలీవుడ్ నటి షబానా అజ్మీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..దాద్రిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సదరు మహిళ(50) ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. షబానా అజ్మీ కారు ప్రమాద సంఘటన నేపథ్యంలో ఉపాధ్యాయురాలు.. అజ్మీ మరణానికి శుభాకాంక్షలు తెలిపేలా వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు తెలిపారు.
దీనిపై విద్యాశాఖ అధికారి బాల్ ముకుంద్ మాట్లాడుతూ.. ‘సదరు ఉపాధ్యాయురాలి చర్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులపట్ల చెడు ప్రభావం చూపేవిధంగా ఉందని అన్నారు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశామని తెలిపారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 18న మహారాష్టలోని రాయ్‌గడ్ ముంబై-పుణే హైవే రోడ్డుపై షబానా ఆజ్మీ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఫేస్‌బుక్ పోస్టుకు అజ‍్మీ మరణానికి శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఉపాధ్యాయురాలు కామెంట్ పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment