Teacher suspension
-
భార్య స్థానంలో విధులకు హాజరై దొరికిపోయిన టీచర్
అనంతపురం: మేడం రోజూ స్కూల్కెళ్లి పాఠాలు చెప్పడం ఇబ్బందనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలీదు కాని ఆమె స్థానంలో భర్త హాజరయ్యారు. తనూ ఓ పాఠశాలలో టీచర్ అయినప్పటికీ అక్కడ విధులకు డుమ్మా కొట్టి..భార్య ‘విధుల’ను నిర్వర్తించారు. ఈ విషయం ఎంఈఓ తనిఖీలో బయటపడడంతో ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అయ్యవారిపైనా చర్యలకు సిఫారసు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రమేష్ కదిరి పట్టణంలోని రాణీనగర్ మునిసిపల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి (స్కూల్ అసిస్టెంట్)గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆర్.అరుణాదేవి ఓడీచెరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ). అరుణాదేవి ఈ నెల 7 నుంచి 9 వరకు సెలవుపై వెళ్లారు. పదో తేదీ (శుక్రవారం) విధులకు హాజరుకావాల్సి ఉండేది. ఆమె వస్తారనే ఉద్దేశంతో ఆరోజు హెచ్ఎం సునీత సెలవు పెట్టారు. కానీ అరుణాదేవి స్థానంలో భర్త రమేష్ విధులకు హాజరయ్యారు. ఈ విషయం ఎంఈఓ చెన్నక్రిష్ణ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆయన డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్ కార్యాలయానికి సిఫారసు చేశారు. మరో ఇద్దరిపైనా.. ►ఓడీచెరువు మండలం గోళ్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ జి.గణేష్ ఏకోపాధ్యాయుడిగా ఉన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే గురు, శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టారు. దీంతో విద్యార్థులందరూ ఇళ్ల వద్దే ఉండిపోయారు. ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ పాఠశాలను తనిఖీ చేయగా .. నిజమేనని తేలింది. దీంతో ఎంఈఓ సిఫారసు మేరకు ఎస్జీటీ గణేష్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులిచ్చారు. ►హిందూపురం మండలం కొట్నూరు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కె.నర్సిరెడ్డిని కూడా డీఈఓ సస్పెండ్ చేశారు. ఆయన విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పడం లేదని ఎంఈఓ గంగప్ప ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. -
నటిపై అభ్యంతకర వ్యాఖ్యలు.. టీచర్ సస్పెన్షన్
నోయిడా: బాలీవుడ్ నటి షబానా అజ్మీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై సస్పెన్షన్ వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..దాద్రిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సదరు మహిళ(50) ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. షబానా అజ్మీ కారు ప్రమాద సంఘటన నేపథ్యంలో ఉపాధ్యాయురాలు.. అజ్మీ మరణానికి శుభాకాంక్షలు తెలిపేలా వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై విద్యాశాఖ అధికారి బాల్ ముకుంద్ మాట్లాడుతూ.. ‘సదరు ఉపాధ్యాయురాలి చర్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులపట్ల చెడు ప్రభావం చూపేవిధంగా ఉందని అన్నారు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశామని తెలిపారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 18న మహారాష్టలోని రాయ్‌గడ్ ముంబై-పుణే హైవే రోడ్డుపై షబానా ఆజ్మీ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఫేస్బుక్ పోస్టుకు అజ్మీ మరణానికి శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఉపాధ్యాయురాలు కామెంట్ పెట్టింది. -
విధినిర్వహణలో సెల్‌ఫోన్ మాట్లాడినందుకు..
కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలో పని వేళ లో సెల్ ఫోన్ మాట్లాడుతున్న ఓ ఉపాధ్యా యుడిని జిల్లా విద్యాశాఖాధికారిణి డి వాసంతి సస్పెండ్ చేశారు. డీఈఓ కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సమయంలో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎస్ నర్సింహారావు సెల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అదేవిధంగా పాఠశాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. అకడమిక్ క్లాసులను ఇప్పటి వరకు ప్రారంభించలేదని గుర్తించిన డీఈఓ.. ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్త ర్వులను విడుదల చేశారు. ఈ సందర్భం గా డీఈఓ వాసంతి మాట్లాడుతూ... పాఠశాల తరగతి గదులలో సెల్‌ఫోన్ విని యోగం నిషేధమని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విద్యార్థితో మలం తొలగింపు
♦ టీచర్ సస్పెన్షన్, అరెస్ట్ ♦ తమిళనాడులో ఘటన సేలం: రెండో తరగతి విద్యార్థితో మలం ఎత్తించి ఓ టీచర్ దాష్టీకాన్ని ప్రదర్శించింది. తమిళనాడు నామక్కల్ సమీప రామాపురం పుదూర్ మాధ్యమిక పాఠశాలలో దళితుడు వీరకుమార్ కుమారుడు శశిధరన్(7) రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో ఓ విద్యార్థి మల విసర్జన చేశాడు.దాన్ని తొలగించాలని టీచర్ విజయలక్ష్మి(35) శశిధరన్‌ను ఆదేశించింది. వినకపోవడంతో చితక బాదింది. తాళలేని శశిధరన్ తన చేతులతో మలాన్ని ఎత్తి బయటపడేశాడు. ఈ సమయంలో సహ విద్యార్థులు అవహేళన చేయడంతో చిన్నారి మానసికంగా కుంగిపోయాడు. తండ్రి వీరకుమార్‌కు వివరించాడు. అతను దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరకుమార్ ఫిర్యాదు మేరకు ఎస్పీ సెంథిల్‌కుమార్, ఆర్డీవో కన్నన్ విచారణ జరిపారు. టీచర్ దాష్టీకం నిజమేనని తేల్చారు.అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. -
అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ సస్పెన్షన్
జగద్గిరిగుట్ట(రంగారెడ్డి జిల్లా):తోటి టీచర్లతో, విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్న రాజేందర్‌పై ఇటీవలి కాలంలో అధికారులకు పలు ఆరోపణలు అందాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డిప్యూటీ డీఈవో ఉషారాణి ఇటీవల పాఠశాలను సందర్శించి విచారించారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించిన డీఈవో రమేశ్ హిందీ పండిట్ రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.