
ప్రతీకాత్మక చిత్రం
కొత్తగూడెం : ప్రభుత్వ పాఠశాలలో పని వేళ లో సెల్ ఫోన్ మాట్లాడుతున్న ఓ ఉపాధ్యా యుడిని జిల్లా విద్యాశాఖాధికారిణి డి వాసంతి సస్పెండ్ చేశారు. డీఈఓ కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సమయంలో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు ఎస్ నర్సింహారావు సెల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. అదేవిధంగా పాఠశాల రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. అకడమిక్ క్లాసులను ఇప్పటి వరకు ప్రారంభించలేదని గుర్తించిన డీఈఓ.. ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్త ర్వులను విడుదల చేశారు. ఈ సందర్భం గా డీఈఓ వాసంతి మాట్లాడుతూ... పాఠశాల తరగతి గదులలో సెల్‌ఫోన్ విని యోగం నిషేధమని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment