జగద్గిరిగుట్ట(రంగారెడ్డి జిల్లా):తోటి టీచర్లతో, విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌కు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పని చేస్తున్న రాజేందర్‌పై ఇటీవలి కాలంలో అధికారులకు పలు ఆరోపణలు అందాయి.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ డిప్యూటీ డీఈవో ఉషారాణి ఇటీవల పాఠశాలను సందర్శించి విచారించారు. ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిశీలించిన డీఈవో రమేశ్ హిందీ పండిట్ రాజేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ సస్పెన్షన్
Published Sun, Mar 1 2015 10:21 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement