
సాక్షి, ముంబై : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అలనాటి బాలీవుడ్ నటి షబానా అజ్మీని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. శనివారం రాత్రి సమయంలో గాయపడ్డ ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమెను జావెద్ అక్తర్, ఫరాన్ అక్తర్, ప్రముఖ నటి టబు, అనిల్ కపూర్, సునీత కపూర్‌తో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు. కాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం డ్రైవర్ ముందుగా వెళుతున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. షబానా రోడ్డు ప్రమాదం తనను బాధకు గురిచేసిందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ఇదివరకే ట్వీట్ చేశారు. (రోడ్డు ప్రమాదంలో షబానాకు గాయాలు)




Comments
Please login to add a commentAdd a comment