అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన షబానా తల్లి | Shaukat Azmi hospitalised | Sakshi

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన షబానా తల్లి

Jun 24 2015 10:54 AM | Updated on Sep 3 2017 4:18 AM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన షబానా తల్లి

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన షబానా తల్లి

బాలీవుడ్ ప్రముఖ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ అజ్మీ మంగళవారం అనారోగ్యానికి గురైయ్యారు.

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ అజ్మీ మంగళవారం అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆమెను దక్షణి ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. ఛాతీ భాగంలో తీవ్ర నొప్పి కలగడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు.

షౌకత్కు వైద్య చికిత్స జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. షబానా అజ్మీ రాత్రి అంతా ఆస్పత్రిలో తల్లి వద్ద ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. షబానా అజ్మీ తల్లి షౌకత్ అజ్మీ ప్రముఖ నాటక కళాకారిణితోపాటు మంచి నటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement