
నా పాత్ర ఆడపిల్లలకు స్ఫూర్తినిస్తుంది
బాలీవుడ్ తెరపై బయోపిక్ల హవా ఇంకా కొనసాగుతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా నిజ జీవిత పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ వారసురాలు సోనమ్ కపూర్ కూడా ఈ లిస్ట్లో చేరిపోయింది. 1986లో హైజాక్ అయిన విమానంలో ప్రయాణికులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఫ్లైట్ అంటెండెంట్ నీరజా భనట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సోనమ్ లీడ్రోల్లో నటిస్తోంది.
నీరజ, 1986లో ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానంలో సీనియర్ ఫ్లైట్ అటెండెంట్గా వెళ్లింది. ఆ విమానం కరాచీ సమీపంలో హైజాక్కు గురైనపుడు ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో ఎంతో సాహసోపేతంగా వ్యవహరించిన ఆమె, చివరకు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాదు నీరజ, అశోక చక్ర అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. కమర్షియల్ థ్రిల్లర్ను తలపించే ఈ పాయింట్లు సినిమాగా తెరకెక్కించటానికిఉపయోగపడటంతో పాటు ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తాయంటుంది సోనమ్ కపూర్.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు రామ్ మాధ్వాని దర్శకుడు, బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ మరో కీలక పాత్రలోనటిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబందించిన టైటిల్ తో పాటు పూర్తి వివరాలను చిత్రయూనిట్ వెల్లడించనుంది.