డాక్టర్ అవతారమెత్తిన హీరోయిన్ | Shabana Azmi turns adviser to ill Juhi Chawla | Sakshi
Sakshi News home page

డాక్టర్ అవతారమెత్తిన హీరోయిన్

Published Sat, Oct 24 2015 4:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

డాక్టర్ అవతారమెత్తిన హీరోయిన్

డాక్టర్ అవతారమెత్తిన హీరోయిన్

యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు అని అడిగితే చాలామంది హీరోయిన్లు డాక్టర్ అన్న సమాధానమే చెబుతారు. కానీ, అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ ఇప్పుడు నిజంగానే డాక్టర్ అవతారం ఎత్తారు. విషయం ఏమిటంటే.. మరో సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా గత ఐదారు రోజులుగా విపరీతంగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. దాంతో పసుపు నీళ్లు తాగాలని ఆమెకు షబానా అజ్మీ చెప్పారు. అది మ్యాజిక్‌లా పనిచేసిందని జూహీ సంబరపడిపోయింది. ప్రస్తుతం షబానాతో కలిసి 'చాక్ ఎన్ డస్టర్' సినిమాలో నటిస్తున్న జూహీ చావ్లా.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలిపింది. పసుపు నీళ్లు తయారుచేసుకోవడం కూడా చాలా సులభమేనని, నీళ్లు బాగా మరిగించి.. అందులో మంచి నాణ్యమైన ఆర్గానిక్ పసుపు వేయాలని చెప్పింది. ఆర్గానిక్ పసుపును షబానా తనకు బహుమతిగా కూడా ఇచ్చారంటూ ఆ ప్యాకెట్ ఫొటోను ట్వీట్ చేసింది.
 
మరోవైపు షబానా అజ్మీ కూడా జూహీ చావ్లాకు థాంక్స్ చెప్పారు. ఇదెందుకు అనుకుంటున్నారా? షూటింగ్ సెట్ దగ్గరకు ఆమె గుజరాతీ వంటకాలు తెచ్చిందట. ఆ వంటలు చాలా రుచిగా ఉన్నాయని, తాను ఇప్పటికీ తాను పెదాలు నాక్కుంటూనే ఉన్నానని షబానా చెప్పారు. జయంత్ గిలాటర్ దర్శకత్వం వహిస్తున్న 'చాక్ ఎన్ డస్టర్' సినిమాలో వీళ్లిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సమీర్ సోనీ, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement