‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం..
మెరో జ్యూయెలరీ
రాజస్థాన్‌లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్‌ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్‌ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
జ్యూయెలరీ బ్రాండ్:
మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000
సాక్షం అండ్ నీహారిక
సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్‌నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్‌పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది.
చీర బ్రాండ్:
సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990
- దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment