ఛాన్సులిస్తే చాలు.. ఎలాంటి పాత్రకైనా నేను రెడీ: ఆరాధ్య దేవి | Saree Heroine Aradhya Devi Comments On Her Glamour | Sakshi
Sakshi News home page

ఛాన్సులిస్తే చాలు.. ఎలాంటి పాత్రకైనా నేను రెడీ: ఆరాధ్య దేవి

Published Fri, Oct 11 2024 3:46 PM | Last Updated on Fri, Oct 11 2024 4:09 PM

Saree Heroine Aradhya Devi Comments On Her Glamour

టాలీవుడ్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న 'శారీ' సినిమాతో ఆరాధ్య దేవి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. కేరళకు చెందిన 23 ఏళ్ల ఈ బ్యూటీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. మలయాళీ మోడల్. చీరకట్టులో ఉన్న ఈ బ్యూటీ ఫోటోలను సోషల్‌ మీడియాలో చూసిన ఆర్జీవీ ఫిదా అయ్యాడు. అలా ఆమెకు ఏకంగా తన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మొదట్లో చీరలో మాత్రమే కనిపించే ఆరాధ్య దేవి ఇప్పుడు గ్లామర్‌ ఫోటోలతో షేక్‌ చేస్తుంది. ఈ విషయంపై ఆమె తాజాగా ఇలా రియాక్ట్‌ అయింది.

మొదట్ల ఛాన్సులు వచ్చినప్పటికీ గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే ఇప్పుడు తన అభిప్రాయాలు మారిపోయాయని సోషల్‌మీడియా ద్వారా  ఆరాధ్యాదేవి చెప్పింది. గ్లామరస్‌తో పాటు ఎలాంటి పాత్రలకైనా తాను సిద్ధమేనని ప్రకటించింది. అలాంటి చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆరాధ్య తెలిపింది. 

'కాలం మారుతున్న కొద్దీ మన అభిప్రాయాలు మారుతాయంటూనే.. జీవిత అనుభవాలే మన నిర్ణయాలను మారుస్తాయని చెప్పుకొచ్చింది. గ్లామర్ అనేది చాలా వ్యక్తిగతమైనది. నాకు, అది వృత్తిలో భాగం. నటిగా వైవిధ్యంగా ఉండటం చాలా కీలకం. గ్లామరస్‌గా ఉన్నా, లేకపోయినా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే. ఉత్తమ పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. గ్లామర్ పాత్రలు చేయకూడదని గతంలో నిర్ణయించుకున్నాను. కానీ, 22 ఏళ్ల వయసులో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నా.' అని ఆరాధ్య పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement