ముంబై ఫ్యాషన్ డిజైనర్ వర్ణిక సాంగోయి డిజైన్ చేసిన అప్‌సైకిల్ డెనిమ్ శారీస్...
ఫ్యాషన్ ప్రపంచంలో అప్ సైక్లింగ్ మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఉన్నదానిని సృజనాత్మకంగా మార్చడంలో కళాత్మక విలువతో ΄ాటు పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి కోసం పరుగులు తీయకుండా ఉన్నవాటిని కొత్తగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజెప్పడానికి డిజైనర్లుపోటీ పడుతుంటారు. దీంట్లో భాగంగా డెనిమ్ అప్ సైక్లింగ్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది.
మనకున్న రకరకాల డిజైన్ వేర్‌లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్‌తో రూపొందించినవి ఉంటాయి. వీటిలో డెనిమ్ జాకెట్స్, స్కర్ట్స్, ప్యాంట్స్ కూడా మోడర్న్ డ్రెస్సుల్లో భాగంగా చేరుతుంటాయి. జీన్స్ ప్యాంటులకు ఉపయోగించే నీలం రంగు గట్టి ఫ్యాబ్రిక్‌ను డెనిమ్ అంటారు. డెనిమ్ డ్రెస్సులైతే సంవత్సరాలుగా ఉపయోగించేవీ ఉంటాయి. కొన్నింటిని తీసిపడేయలేం, అలాగని వార్డ్ రోబ్స్‌లోనూ ఏళ్ల తరబడి ఉంచేయలేం. ఈ పరిస్థితులలో వాటికో కొత్త రూపు ఇవ్వడం చాలా మేలైన కళ. టాప్స్, కుర్తీస్, శారీస్.. ఇలా అనుకూలతను బట్టి అందమైన డిజైనర్ వేర్‌ని రూపొందించవచ్చు. లేదంటే విడిగా కొత్త ఫ్యాబ్రిక్‌తో సరికొత్త డిజైన్‌నీ క్రియేట్ చేయవచ్చు.
అప్ సైకిల్ డెనిమ్ శారీ వర్ణిక సాంగోయి ముంబై ఫ్యాషన్ డిజైనర్. డెనిమ్‌తో ఎన్నో అప్‌సైకిల్ డిజైన్స్ చేసిన డిజైనర్. మోడర్న్ డ్రెస్సులే కాదు శారీస్‌ను కూడా డెనిమ్ టచ్‌తో,ప్యాచ్ వర్క్‌తో వివిధ రకాల మెటీరియల్‌ను ఉపయోగిస్తూ తయారు చేసింది. డెనిమ్ దర్జి పేరుతో స్టూడియో కూడా రన్ చేస్తుంది.
– నెట్ ఫ్యాబ్రిక్, డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన చీర ఇది. చీర బార్డర్‌పైన ఘుంగ్రూ వర్క్ డిజైన్ చేశారు.
– పోల్కా డాట్స్‌ప్యాచ్ వర్క్‌తో రూపొందించిన శారీ
– లినెన్ శారీకి జియోమెట్రిక్ స్టైల్‌లో కట్ చేసిన డెనిమ్ క్లాతతో ప్యాచ్ వర్క్ చేశారు.
– స్కర్ట్ శారీని డెనిమ్‌ను ఉపయోగిస్తూ చేసిన మ్యాజిక్ స్టైల్ డ్రెస్ ఇది.
– డెనిమ్ క్రాప్‌టాప్
– కాటన్ ఫ్యాబ్రిక్ – డెనిమ్ జాకెట్‌ని ఉపయోగిస్తూ రూపొందించిన కుర్తా
– లేస్‌తో లాంగ్ స్లీవ్స్ రూపొందించిన డెనిమ్ జాకెట్
– డెనిమ్ ప్యాచ్‌వర్క్‌తో మోడర్న్ టాప్
– డెనిమ్ ప్యాంట్ బెల్ స్టైల్‌కి క్రోచెట్ డిజైన్‌ను అదనంగా జత చేస్తే వచ్చే స్టైల్.
ఇవి చదవండి: పవర్‌ఫుల్ ప్రఫుల్..!
Comments
Please login to add a commentAdd a comment