తెలుగు ప్రేక్షకులు ‘ఇష్టం’గా ఆదరించిన హీరోయిన్ శ్రియా శరన్. ఆమె ఇష్టంగా ధరించే బ్రాండ్ అవుట్ ఫిట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ...
ఆనంద్ కబ్రా
డిజైనర్ ఆనంద్ కబ్రాకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. 1997లో లండన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాడు. తర్వాత ఇండియా వచ్చి, 2001లో తన పేరు మీదే ముంబైలో ‘ఆనంద్ కబ్రా లేబుల్’ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించాడు. ఇప్పడది సెలబ్రిటీస్ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. 2006లో హైదరబాద్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌కు తను అందించిన ‘07 కలెక్షన్స్’ మంచి ప్రాచుర్యం పొందాయి. సందర్భానికి తగ్గట్టు దుస్తులను డిజైన్ చేయటంలో ఆనంద్‌కు పెట్టింది పేరు. అందుకే, ఎంతోమంది సెలబ్రిటీలు, తమ రెడ్ కార్పెట్ డ్రెస్‌లను ఆనంద్ కబ్రాతో స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటుంటారు. అయితే, దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది.
‘ఖరీదైన దుస్తులు, ఆభరణాలు అందాన్ని పెంచుతాయి. కానీ నిజమైన అందం అంటే ఆరోగ్యమే. మీరు మీలా ఉంటూ.. సరైన జీవన శైలి, ఆహారపుటలవాట్లు పాటిస్తే అందరూ అందంగా కనిపిస్తారు’ – శ్రియా శరన్.
శ్రియ కట్టుకున్న చీర డిజైనర్: ఆనంద్ కబ్రా
ధర: రూ. 44,000
- దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment