అప్పటికీ, ఇప్పటికీ నన్ను పనికిమాలినదానిలానే చూస్తారు: శ్రియ | Actress Shriya Saran Says She has Been Judged as Frivolous for Being an Actor | Sakshi
Sakshi News home page

Shriya Saran: నేను తల్లిని.. అయినా అలాగే చూస్తారు.. అది చూసి నా భర్త..

Published Wed, Feb 28 2024 6:30 PM | Last Updated on Wed, Feb 28 2024 7:17 PM

Actress Shriya Saran Says She has Been Judged as Frivolous for Being an Actor - Sakshi

సోషల్‌ మీడియా వచ్చాక ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం మరింత ఈజీ అయిపోయింది. సెలబ్రిటీలనయితే ఇష్టమొచ్చినట్లు అనేస్తున్నారు. నచ్చితేనేమో దేవతలా ఉన్నావని, నచ్చకపోతే చెండాలంగా ఉన్నావ్‌, దరిద్రంగా ఉన్నావ్‌.. ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటి? ఇలా నానామాటలు అంటున్నారు. టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియకు సైతం ఇలాంటి అనుభవాలు తరచూ ఎదురవుతున్నాయట! ఒక బిడ్డకు తల్లయినా కూడా తనను ఇప్పటికీ జడ్జ్‌ చేస్తున్నారని భావోద్వేగానికి లోనైంది.

మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్‌..
'ఇండస్ట్రీలోని మహిళా నటులను, హీరోయిన్లను పనికిమాలిన వ్యక్తులుగా చూస్తారు. ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది. కొన్ని మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. ఇవన్నీ మర్చిపోయేందుకు నేను నా పాత స్నేహితుల దగ్గరికి వెళ్లిపోయి వారితో సంతోషంగా గడుపుతాను. నా భర్త చూసి.. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మరీ ఇంతలా ఎవరూ ఆలోచించరేమో అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ ఆ కామెంట్స్‌ చూసినప్పుడు ఫీల్‌ అవకుండా ఉండలేం. ఇప్పుడు నేను ఒక తల్లిని.

నా గురించి నాకు తెలుసు
నా భర్త, కూతురుతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కూడా జనాలు నన్ను చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. నాకేది ఇష్టమైతే అదే ధరిస్తాను. నేను మంచిదాన్ని అన్న విషయం నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నందుకు మా గురించి ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎలా చూస్తున్నారు? అనేది వారి సమస్య.. నాది కాదు!' అని చెప్పుకొచ్చింది. కాగా శ్రియ ప్రస్తుతం 'షో టైమ్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌ హాట్‌స్టార్‌లో మార్చి 8 నుంచి ప్రసారం కానుంది.

చదవండి: ప్రముఖ డైరెక్టర్‌ నన్ను తిట్టి, అందరిముందే కొట్టాడు..: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement