నాస్కూల్ డేస్‌లో టీచర్లంతా చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవారు. వారందరిలో ఇంగ్లీష్ టీచర్ మరీ ప్రత్యేకంగా ఉండేది. 9గజాల చీరతో ఎంత అద్భుతంగా కనపడేదంటే కళ్లార్పడం మరచిపోయేదాన్ని. పొడవుగా, స్లిమ్‌గా ఉండే ఆమెకు ఏ చీరైనా బాగా నప్పేది. నేను రకరకాల చీరల్లో ఆమెను చూస్తూ ఆమెకు ఎలాంటి డిజైన్లు బాగుంటాయో ఊహించుకునేదాన్ని. నాలో చీర మీద ఆసక్తితో పాటు డిజైనింగ్‌ని కెరీర్‌గా మార్చుకోవడానికి కూడా ఆమే కారణమేమో అనిపిస్తోంది. ఓ రకంగా ఫ్యాషన్ రంగంలో ఆమే నాకు గురువు అని చెప్పాలి. ఫ్యాషన్ స్కూల్ నడుపుతూ నేనూ టీచర్ పాత్రకు మారా. ఆమెలానే చీరకట్టుకే ప్రాధాన్యమిస్తున్నా
- ఆయేషాలఖోటియా, లఖోటియా ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్
ఏకలవ్య శిష్యురాలిని
డిజైనర్లు రోహిత్‌బాల్, సవ్యసాచిలకు ఏకలవ్య శిష్యురాలిని నేను. ఇద్దరినీ పరిశీలిస్తూ నా డిజైనింగ్‌లో మెరుగులు దిద్దుకున్నాను. వీరిలో రోహిత్‌బాల్ ఒక నిజమైన కొచూరియర్ అయితే సవ్యసాచి భారతీయ ఫ్యాబ్రిక్స్‌కి సమకాలీన శైలిని అద్దడంలో దిట్ట. ఎప్పటికప్పుడు ప్రపంచ విపణి మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకునే ఈ ఫ్యాషన్ సామ్రాట్టుల పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను. వీరిద్దరూ నాకు ఎప్పుడూ స్ఫూర్తి ప్రదాతలే. అంతేకాదు నేను డిజైనింగ్ కోర్సు చేసి నిఫ్ట్‌లోనే వీరు నాకు సీనియర్స్ కావడం కూడా ఒక విశేషం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకంటూ ఒక స్థానం తెచ్చుకున్న తర్వాత సవ్యసాచిని ఒకసారి కలవగలిగాను. ఆ అపురూప సందర్భం నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను.
- ఇషితాసింగ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్