English Teacher
-
వీక్లీ వస్తారు సారు..తహసీల్దారు మాస్టారు!
చందంపేట: తహసీల్దార్ ఉద్యోగం అంటేనే ఊపిరిసలపనివ్వని విధి నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అలాంటిది.. ఆ హోదాలో విధులు నిర్వహిస్తూనే.. పిల్లలకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారొక అధికారి. ఆయనే నల్లగొండ జిల్లా చందంపేట తహసీల్దార్ శ్రీనివాస్. ఆయన ఇటీవల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులతో ముచ్చటించారు. తమకు ఆంగ్ల ఉపాధ్యాయుడు లేక పాఠాలు చెప్పేవారే లేరని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.తహసీల్దార్ శ్రీనివాస్ అప్పటికప్పుడే.. విద్యార్థినులకు కొద్దిసేపు ఆంగ్ల పాఠాలు బోధించారు. వారంలో ఒకరోజు సమయం కేటాయించి విద్యార్థులకు బోధిస్తున్నా రు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన శ్రీనివాస్.. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏవోగా ఉద్యోగం చేస్తూ పదోన్నతిపై చందంపేట తహసీల్దార్‌గా వచ్చారు. ఒకప్పటి ఉపాధ్యాయ వృత్తి మిగిల్చిన అనుభవంతో.. చందంపేట కస్తూర్బా పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠాలు బోధిస్తున్నారు. శనివారం 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ కనిపించారు. -
తినడానికి తిండిలేక,చెన్నై రోడ్లపై భిక్షాటన..ఇన్‌స్టా వీడియోతో పాపులారిటీ
కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి. బర్మాకు చెందిన మెర్లిన్ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. దుస్తులు కొనివ్వండి బాబూ... ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్కిడ్’అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోన్న మొహమ్మద్ ఆషిక్ కంటపడింది మెర్లిన్. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. యాచించ కూడదనీ... మెర్లిన్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్. తన విద్యార్థులసాయంతో... ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు. కొంతమంది ఆమెతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) -
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు చూసి సాగకన్యగా ఉద్యోగం
జలకన్య, మత్స్య కన్య అని వినపడగానే ఎక్కడ? ఎక్కడ? అని చూస్తుంటారు చాలామంది. శరీర పైభాగం మనిషిగా, కింది భాగం చేపరూపంలో ఉండే జలకన్యలంటే ఆసక్తి ఉండనిదెవరికి? జలకన్యను చూసేందుకు అందరూ ఆరాటం దగ్గరే ఆగిపోతే, మాస్ గ్రీన్ మాత్రం మత్స్యకన్యపై మరింత మక్కువతో తానే ఓ జలకన్యగా మారి పోయింది. మత్స్యకన్యలా ఈదుతూ... ఈ ఉద్యోగం ఎంత బావుందో అని తెగ సంబరపడిపోతుంది. యూకేలోని టార్క్వే నగరానికి చెందిన ముప్ఫైమూడేళ్ల మాస్గ్రీన్ 2016లో ఇటలీలోని సిసిలీ వెళ్లింది. అక్కడ ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన సమయంలో ఏం చేయాలో తోచక కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. అలా ఆలోచిస్తున్న సమయంలో ఇంటికి దగ్గరలో ఉన్న బీచ్‌లో ఒకతను ‘మ్యాజికల్ మెర్మాన్’ డ్రెస్‌లో కనిపించాడు. అది చూసిన మాస్కు చాలా ఆసక్తిగా అనిపించింది. వెంటనే జలకన్య ఎలా ఉంటుందో తెలుసుకుని, తను కూడా అలా తయారవాలనుకుంది. అప్పటి నుంచి జలకన్యగా తయారవడం తనకెంతో ఇష్టమైన హాబీగా మార్చుకుంది. మత్య్సకన్యగా రెడీ అయ్యి తనని తాను చూసుకుంటూ తెగమురిసిపోయేది. ఇన్స్టాగ్రామ్ ఆఫర్‌తో... మత్య్సకన్యగా తయారైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేస్తుండేది. ఆ ఫొటోలు చూసిన ఓ సంస్థ మత్య్స కన్య ఉద్యోగం ఇస్తాం అని మాస్‌ని పిలిచింది. దీంతో సిసిలీ బీచ్‌కు దగ్గర్లో ఉన్న ‘లాంపేడుసా’ ఐలాండ్‌లో మత్య్సకన్యగా పనిచేస్తోంది. ఊపిరిని బిగపట్టి నీటి అడుగు భాగంలో డైవింగ్ చేయడం, నిజమైన జలకన్యలా అటు ఇటు తిరగడం వంటి విన్యాసాలతో పర్యాటకుల్ని ఆకర్షించడమే ఆమె ఉద్యోగం. బోట్ టూర్స్‌కు గైడెన్స్ ఇస్తూనే, జలచరాలు నీటిలో ఎలా కదులుతాయో చెబుతూ పర్యాటకులకు ఈదడం నేర్పించడం ఈ ఉద్యోగంలో చేయాల్సిన ఇతర ముఖ్యమైన పనులు. వేసవి సమయాల్లో రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మాస్ వివిధ రకాల చేపల కదలికను గమనించి, ఈదడంలో మెళకువలు నేర్చుకుంది. ఊపిరిని బిగపట్టడాన్ని ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని కష్టపడి అభ్యసించింది. ప్రస్తుతం తన వృత్తిలో ఎంతో సంతోషంగా ఉంది మాస్ గ్రీన్.మాస్ గ్రీన్ తన ఆసక్తితో సరికొత్త ఉద్యోగాన్ని సృష్టించి ఎంతో మంది నిరుద్యోగులకు కొత్త దారి చూపించింది. ఇష్టం, చేయాలన్న సంకల్పం ఉంటే ఏదో రకంగా దారి దొరుకుతుందనడానికి ఈ జలకన్య ఉద్యోగమే ఉదాహరణగా నిలుస్తోంది. ఖర్చులకు సరిపోతుంది.. ‘‘టీచర్‌గా పనిచేసేటప్పుడు వచ్చే జీతం కంటే మత్య్సకన్య ఉద్యోగానికి జీతం తక్కువే. అయినా నా ఖర్చులకు తగినంత సంపాదిస్తున్నాను. ఇది చాలు. ఈ ఉద్యోగం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అమ్మకు.. మత్య్స కన్య హాబీ గురించి తెలిసినప్పుడు.. అసాధారణమైనదిగా భావించారు. కానీ దీనినే కెరీర్‌గా ఎంచుకుంటానని ఆమె అస్సలు అనుకోలేదు. నా సంతోషం చూసి ఇప్పుడు అమ్మే నన్ను∙ప్రోత్సహిస్తున్నారు’’ . – మాస్ గ్రీన్. -
Manu Gulati: ఈవిడ మామూలు టీచర్ కాదండోయ్!
పాఠాలంటే బోరుగా ఫీలయ్యే ఈరోజుల్లో.. పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పడం ఒక కళగా మారింది. ఆ కళను అవపోసిన టీచరమ్మే ఈ మను గులాటి. అదేనండీ పాఠం అయిపోగానే.. విద్యార్థినితో కలిసి హుషారుగా గంతులేసిందే.. ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. హర్యాన్వి సంగీతానికి తన విద్యార్థినితో కలిసి హుషారుగా ఆమె వేసిన స్టెప్పులు, పిల్లలతో ఆమె వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే ఆమె మామూలు ఇంగ్లిష్ టీచర్ మాత్రమే కాదండోయ్. ‘‘పాఠ్య బోధన అనేది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు.. ఇతర ఉపాధ్యాయులకు కూడా మార్గదర్శకత్వం చేయడం. మను గులాటీ ఇందులో ఓ వెలుగు వెలిగారు. సాంకేతికతను ఉపయోగించడం, సంగీతం, నృత్యంలో ఆమెకు ఉన్న జ్ఞానంతో వినూత్న పద్ధతుల్లో బోధించడాన్ని రూపొందించారామె. అలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా’’. ఈ వ్యాఖ్యలు ఎవరివో కాదు.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ సారాంశం. ► ప్రస్తుతం నెటిజన్ల మనుసులు గెల్చుకున్న మిస్ మను గులాటి ప్రొఫైల్ ఆషామాషీగా లేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన మను గులాటి.. 2004లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. ► 2011 నుంచి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతున్నారు. 2020లో జమీయా మలీయా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ► పిల్లలతో ఆమె సరదాగా, ప్రేమగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఆస్వాదించదగ్గ రీతిలోనే పాఠాలు చెప్తుంటారామె. అందుకే విద్యార్థులకు ఫేవరెట్ టీచర్‌గా ఉన్నారామె. అంతేకాదు.. టీచింగ్ కెరీర్లోనే ఎన్నో అవార్డులు దక్కాయి ఆమెకు. ► 2015లో.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ ఐసీటీ అవార్డు ఫర్ స్కూల్ టీచర్స్ ను అందుకున్నారామె. ► 2018లో నేషనల్ టీచర్స్ అవార్డుతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మెప్పు అందుకున్న టీచర్స్‌లో ఈమె ఒకరు. ఆపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నుంచి గౌరవ సత్కారం అందుకున్నారు. Teaching is about educating students, and mentoring other teachers too. Ms. Manu Gulati is a shining beacon in this. She has also developed innovative methods of teaching through technology, music and dance. Delighted that she wins the National Award for Teachers. pic.twitter.com/EGEER7G8Ba — Narendra Modi (@narendramodi) September 4, 2018 ► ఫుల్బ్రైట్ టీచింగ్ స్కాలర్షిప్ దక్కించుకున్న ఆమె.. అమెరికాలో పర్యటించి అక్కడి విద్యావ్యవస్థ, పాఠాలు చెప్పే తీరుపైనా అధ్యయనం చేసే అవకాశం దక్కించుకున్నారు. Fulbright journey is an opportunity to learn, share & grow not just as a teacher but... also as a human. Glad I could learn from the most phenomenal teachers across globe. Proud of being a Fulbrighter Worth cherishing a lifetime!#DelhiGovtSchool teacher#FulbrightINDIAat70 https://t.co/MmEYpCAaM8 pic.twitter.com/tXMTscvvyd — Manu Gulati (@ManuGulati11) February 2, 2020 ► గొప్ప ఉపాధ్యాయుడే.. గొప్ప విద్యార్థులను సమాజానికి అందించగలడు. ఇలాంటి ఎక్స్ట్రార్డినరీ టీచర్ల సపోర్ట్ ఉంటేనే.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి అద్భుతాలు సాధించగలరు.. మను గులాటి మీద ప్రస్తుతం పలువురు వెలువరుస్తున్న అభిప్రాయాలు ఇవి. Students love to be teachers. They love role reversal. "मैम आप भी करो। मैं सिखाऊंगी।" English lang teaching followed by some Haryanvi music- A glimpse of the fag end of our school day.☺️💕#MyStudentsMyPride #DelhiGovtSchool pic.twitter.com/JY4v7glUnr — Manu Gulati (@ManuGulati11) April 25, 2022 సంబంధిత వార్త: వావ్ అమేజింగ్.. విద్యార్థినితో స్టెప్పులేసిన టీచర్! -
స్వీపర్‌గా చేసిన స్కూల్లోనే ఇంగ్లిష్ టీచర్‌గా!
కన్హన్‌గడ్‌లోని ఇక్బాల్ ప్రాథమికోన్నత పాఠశాల ఆరో తరగతి గదిలోకి వచ్చిన కొత్త ఇంగ్లిష్ టీచర్‌ను చూసి పిల్లలు ‘ఆ’ అని నోరు తెరిచారు.‘గుడ్మాణింగ్ స్టూడెంట్స్’ అని టీచర్ లింజా చెప్పినా, తిరిగి వారు గుడ్మాణింగ్ చెప్పడం మర్చిపోయిట్లుగా ఆమెనే చూస్తుండిపోయారు.ఆమె పేరు లింజా అని, రోజూ స్కూల్ ఊడ్చి, శుభ్రం చేసే ఆయా అనిమాత్రమే వారికి తెలుసు. మరైతే ఇదేమిటి!! ఇంగ్లిష్ టీచర్‌గా లింజాకు అది తొలి రోజు. స్కూలు ఆమెకు కొత్త కాదు కానీ, స్కూల్లోని క్లాసు కొత్తగా ఉంది. అయితే బడిని శుభ్రం చేసే ఒక ఆయమ్మ ఇంగ్లిష్‌ను ‘టీచ్’ చేయడం ఏంటి అనే సందేహాన్ని పిల్లల్లో చాలా త్వరగానే పోగొట్టారు లింజా. టీచరుగా చేరిన 2018 నుంచి ఈ రోజు వరకు ఆరు, ఏడు తరగతులకు తను తీసుకున్న ఒక్క క్లాసులో కూడా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ని మలయాళంలో చెప్పలేదు ఆమె. పిల్లల్ని కూడా ఇంగ్లిష్‌లో తప్ప వేరే భాషలో మాట్లాడనివ్వలేదు! ఇప్పుడా పిల్లలంతా మంచి ఇంగ్లిష్ గడగడ మాట్లాడేస్తున్నారు. లింజా 2013 నుంచి 2018 వరకు ఇక్బాల్ స్కూల్లో స్వీపర్‌గా ఉన్నారు. అంతక్రితం 2001 నుంచి 2006 వరకు కూడా స్వీపర్‌గానే ఉన్నారు. ఈ మధ్యలో (2006–2013 ) వచ్చిన విరామంలోనే తనకు తెలియకుండానే టీచర్ కావడానికి అవసరమైన అన్ని అర్హతలూ సంపాదించారు లింజా! ఆ అర్హతలకు కోసం ఆమె ఎంత శ్రమపడ్డారన్న విషయం కన్నా, అసలు ఆమెకు ఆ విరామం ఎలా వచ్చిందన్నదే ఎక్కువ ఆసక్తి కలిగించే సంగతి. అదేమిటో తెలుసుకోడానికి మనం పందొమ్మిదేళ్లు వెనక్కి వెళ్లాలి. ‘నేనేమిటి? స్వీపర్ ఏమిటి?’ అప్పట్లో లింజా తండ్రి రాజన్ ఇక్బాల్ స్కూల్లోనే సంస్కృతం టీచర్‌గా పని చేస్తున్నారు. లింజా డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అది 2001. రాజన్ హఠాత్తుగా మరణించారు. అందుకు పరిహారంగా తండ్రి స్థానంలో కూతురికి.. అప్పటికి ఆమెకున్న విద్యార్హతలను బట్టి.. ఖాళీగా ఉన్న పోస్టును ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టు.. ‘స్వీపర్’. అదైనా ఆ పని చేస్తున్నవారెవరో దీర్ఘకాలపు సెలవు మీద వెళ్లిపోవడంతో తాత్కాలికంగా ఖాళీ అయిన పోస్టు. లిజా తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడిని చదివించాలి. కుటుంబాన్నీ పోషించాలి. ఇంకేం ఆలోచించకుండా స్వీపర్‌గా చేరిపోయారు లింజా. అయితే ఆ సెలవు పెట్టిన వాళ్లు 2006 తిరిగొచ్చారు. దాంతో ఆమె పోస్టు పోయింది. పోస్ట్ అయితే పోయింది కానీ, అప్పటికే ఆమె స్కూల్లో పనిచేస్తూనే బి.ఎ. పూర్తి చేశారు. ఎం.ఎ. ఇంగ్లిష్ చేశారు. బి.ఇడి. కూడా పాస్ అయి, ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ చెబుతున్నారు. ఆ సమయంలో ఆమెకు స్కూల్ నుంచి పిలుపు! మళ్లీ అదే స్వీపర్ పోస్ట్. మొదటిసారి ‘నేనేమిటి? స్వీపింగ్ ఏమిటి?’ అనుకున్న లింజా.. రెండోసారి స్వీపర్‌గా మళ్లీ చేరుతున్నప్పుడు అలా అనుకోలేదు. పనిపై తనకున్న గౌరవం అది. మరి తన చదువుకు ఆమె ఇచ్చిన గౌరవం మాటేమిటి? ఉద్యోగం చేస్తూనే టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్ రాసి, పాస్ అయ్యారు. ‘స్టేట్ ఎలిజబిలిటీ టెస్ట్’ కూడా రాయమని ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణ ప్రోత్సహించారు. అయితే అప్పటికే ఆమెకు ఆరేళ్ల కొడుకు, నెలల వయసున్న కూతురు. ఇద్దర్నీ చూసుకోవాలి. ‘‘టెస్ట్‌కు ప్రిపేర్ అవడం నా వల్ల కాదు మేడమ్’’ అన్నారు లింజా. ‘వాళ్లిద్దర్ని కూడా స్కూల్‌కి తెచ్చేయ్. నేను చూసుకుంటాను. నువ్వు ప్రిపేర్ అవు’’ అన్నారు ప్రవీణ! అంతకన్నా కావల్సిందేముంది. స్టేట్ టెస్ట్ కూడా పూర్తయింది. టీచర్‌గా అదే స్కూల్లో పోస్టింగ్ వచ్చింది. ‘‘చూస్తుండండి.. ఇదే స్కూల్‌కి లింజా ఏనాటికైనా హెడ్మిస్ట్రెస్ అవుతారు’’అని నవ్వుతూ అంటున్నారు ప్రవీణ. -
విద్యార్థిని చితకబాదిన ఇంగ్లీష్ టీచర్
కర్నూలు, దేవనకొండ: మండలకేంద్రమైన దేవనకొండ జెడ్పీ పాఠశాల ఇంగ్లిషు టీచర్ అరుణ కుమారి పదోతరగతి విద్యారి వీరేష్‌ను తీవ్రంగా చితకబాదింది. సంక్రాంతి సెలవుల్లో హోం వర్క్ చేయలేదని తోటి విద్యార్థుల ముందే విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి స్కూలుకు చేరుకుని ఇంగ్లిషు టీచర్‌తో వాగ్వాదానికి దిగింది. తప్పు చేస్తే మందలించాలే తప్ప శరీరంపై వాతలు పడేలా కొడతారా అని నిలదీశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
వైరల్: ఇంగ్లిష్ రెండు లైన్లు చదవలేని టీచర్
లక్నో: కొన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎంత నాణ్యంగా ఉంటుందో కళ్లకు కట్టే ఉదంతం ఇది. ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే దారుల్లో కొలువు కొట్టేసిందో తెలియదు గానీ.. ఆ ఇంగ్లిష్ టీచర్ ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలోని కనీసం రెండు లైన్లు కూడా సరిగా చదవలేక అడ్డంగా దొరికిపోయింది. తనిఖీకి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సికందర్పూర్ సరౌసిలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ పాండే ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఓ తరగతి గదిలో ఇంగ్లిష్ బోధిస్తున్న ఉపాధ్యాయురాలి బోధన తేడాగా ఉండడంతో ఆమెకు ఇంగ్లిష్ పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. ఆమె పిల్లలకంటే దారుణంగా చదవడం మొదలెట్టింది. దీంతో వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఉపాధ్యాయురాలితో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు మెజిస్ట్రేట్‌కు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పిల్లల భవిష్యత్తు ఇలాంటి వారి చేతుల్లో పెడితే వారి భవిష్యత్తు ఏంటి అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించడంతో వారు కూడా చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు. -
బ్యాడ్ ఇంగ్లిష్ టీచర్ సస్పెన్షన్
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జిల్లాలోని చందర్లపాడు మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్లో ఇంగ్లిషు టీచర్‌గా పని చేస్తున్న డీ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నట్లుగా డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడు. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో సహనం నశించిన విద్యార్థినులు సమస్యను తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటంతో పాటు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన జిల్లా విద్యా శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే రీతిలో వ్యవహరించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు డీఈవో రాజ్యలక్ష్మి సిద్ధమయ్యారు. ఈ మొత్తం వ్యహారంపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని నందిగామ డెప్యూటీ డీఈవో చంద్రకళను ఆదేశించారు. చందర్లపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు, తోటి ఉపాధ్యాయులను ఆమె విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు నుంచి వివరాలు సేకరించారు. ఈ విచారణలో పదో తరగతి విద్యార్థినులకు టీచర్ తన సెల్ ద్వారా అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లను పంపుతున్నట్లు వెల్లడయ్యింది. అంతే కాకుండా తన ఇంటి వద్ద ఉపయోగించే సెల్ నుంచి కూడా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నట్లు తేలింది. ఈ మేరకు డీఈవోకు సమగ్ర నివేదికను అందజేశారు. దాని ఆధారంగా టీచర్‌పై డీఈవో రాజ్యలక్ష్మి సస్సెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడు ముందస్తు అనుమతి లేకుండా మండల కేంద్రం విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల హెచ్ఎంకి సూచిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
టీచర్ మెడలో చెప్పుల దండ వేసి..
-
కోచింగ్ సెంటర్‌కు రావడం లేదని..
భువనేశ్వర్: విద్య వ్యాపారంగా మారిందనడానికి ఒడిషాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. తన కోచింగ్ సెంటర్లో చదువుచెప్పే టీచర్ మరో ఇన్స్టిట్యూట్లోకి మారడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రబుద్ధుడు అత్యంత అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. సదరు టీచర్ మెడలో చెప్పుల దండ వేసి ఘోర అవమానం చేశాడు. ఈ ఘటన నయాగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. తపన్ మహాపాత్రకు చెందిన సత్యసాయి కోచింగ్ సెంటర్లో మయాధర్ మహాపాత్ర అనే వ్యక్తి ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా తపన్ జీతం సరిగా చెల్లించడం లేదు. దాంతో మయాధర్ ఇటీవల మరో కోచింగ్ సెంటర్లో జాబ్‌లో చేరాడు. మయాధర్ వెళ్లిపోవడంతో తన కోచింగ్ సెంటర్ సరిగా నడవడం లేదని తపన్ అతనిపై పగ పెంచుకున్నాడు. మంగళవారం విధులకు బయల్దేరిన మయాధర్ను తపన్ మరో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. అతనిపై దాడికి దిగారు. చెట్టుకు కట్టేసి చెప్పుల దండవేసి అవమానించారు. విషయం బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అయితే, ఈ వ్యవహారాన్నంత ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. తనకు ఘోర అవమానం చేసిన తపన్, మరో ఇద్దరిపై మయాధర్ ఫిర్యాదు చేశాడని జిల్లా ఎస్పీ ఆశిష్‌సింగ్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ తెలిపారు. -
ట్రంప్‌కి ఇంగ్లిష్ రాదా..!
న్యూయార్క్: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..! అక్షరాల కూర్పులో తప్పులు దొర్లితే అమెరికా అధ్యక్షుడి ఉత్తరమైనా దానిపై టీచర్ పెన్ను పడాల్సిందే..! విషయమేంటంటే.. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని పాఠశాలపై ఫిబ్రవరిలో నికోలజ్ క్రూజ్ అనే ఉన్మాది విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని అట్లాంటాలో నివాసముంటే వ్యోన్ మాసోన్(61) అనే రిటైర్డ్ టీచర్ కొన్నాళ్ల క్రితం దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆమె ఉత్తరంపై స్పందించిన వైట్‌హౌస్ కార్యాలయం ట్రంప్ పేరుతో మాసోన్కు ప్రత్యుత్తరం రాసింది. ‘విద్యార్థుల భద్రత, బాధిత కుటుంబాల సంక్షేమంపై మీ సూచనలకు ధన్యవాదాలు. త్వరలోనే అన్ని వర్గాల మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వైట్ హౌస్‌లో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామ’ని లెటర్లో పేర్కొన్నారు. అయితే, సదరు ఉత్తరం తప్పుల తడకగా ఉండడంతో ఇంగ్లిష్ టీచర్ మాసోన్కు చిర్రెత్తుకొచ్చింది. లేఖలోని దోషాలను సరిచేయకుండా ఆమె ఉండలేక పోయారు. అందులోని గ్రామర్, ఉచ్చారణ దోషాలను సరిదిద్ది ఆ లేఖను తిరిగి వైట్ హౌస్‌కు పంపారు. ఉత్తరం పైభాగాన ‘గ్రామర్, శైలికి సంబంధించి మీరు చెక్ చేశారా?’ అని మాసోన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లేఖలోని భాషాంశాలు మరీ పేలవంగా ఉన్నాయి. పొరపాట్లు సహజం. నాకు తెలిసినంత వరకు చేశాను’ అని మాసోన్ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆ లెటర్ కాపీని షేర్ చేశారు. అయితే ‘ఓ మై గాడ్’, ‘యూ ఆల్’ అంటూ ఆమె ఉత్తరంలో ఆశ్చర్యం వ్యక్తం చేయడాన్ని కొందరు తప్పుబట్టారు. -
శిరీష్ మా‘స్టార్’ వచ్చిండు.. ఇంగ్లిష్ పాఠం చెప్పిండు
బంజారాహిల్స్: సినీనటుడు అల్లు శిరీష్ టీచర్ అవతారం ఎత్తాడు. పెగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ తరగతులు బోధిస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో ఆయా స్కూళ్లలో పాఠాలు చెప్పిస్తుంటారు. ఇలా శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4,5 తరగతి విద్యార్థులకు అల్లు శిరీష్ గెస్ట్ టీచర్‌గా రెండు గంటల పాఠాలు బోధించాడు. విద్యార్థులకు సరదాగా ప్రశ్నలు వేస్తూ ఆంగ్లంలో సమాధానలు రాబట్టాడు. అనంతరం చిన్నారులు శిరీష్‌తో ఫొటోలు దిగారు. అతడు మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజని, పిల్లలకు తాను పాఠం చెప్పడం అద్భుతంగా ఉందన్నాడు. తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. -
కీచక టీచర్ మారలేదు.. గ్రామస్తులు వదల్లేదు..
వి.కోట: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణ పరిధిలోని ఖాజీపేట ఉర్దూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సోమవారం గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో తిరుమల ప్రసాద్ అనే ఇంగ్లీష్ టీచర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. తప్పుడు మాటలతో వేధించినట్లు వాపోయారు. బాధిత బాలికలు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని నిందితుడిని చెట్టుకు తాళ్లతో కట్టి దేహశుద్ధి చేశారు. ఇంతకు ముందు కూడా సదరు ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో అమ్మాయిలను వేధించిన కేసులో 3సంవత్సరాలు సస్పెండై కొద్దిరోజుల క్రితమే మళ్లీ విధుల్లో చేరాడు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ రవిప్రకాష్ స్పందించి ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తరలించారు. -
ఇంగ్లిషు టీచరునవుతా
రంగంపేట : కృషి, పట్టుదలతోపాటు చలించని ఆత్మబలం ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చునని చెబుతోంది మండలంలోని సింగంపల్లి హైస్కూల్ టెన్త్ విద్యార్థిని దేవిశెట్టి రోజారాణి. రంగంపేట హైస్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు చక్రరావు, బేబిల మేనరికం వివాహం వల్ల తాను పుట్టుకతో అంధురాలినని చెప్పింది. తల్లిదండ్రులు, మిత్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే టెన్త్ పరీక్షలు రాస్తున్నానని తెలిపింది. పాఠశాలలో ఉపాధ్యాయులు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటానని, ఇంటి వద్ద తమ్ముడు వినయ్ (పెద్దమ్మ కుమారుడు), చెల్లి శిరీష చదువుతూ వుంటే వాటిని జ్ఞాపకముంచుకుంటూ ప్రతి తరగతిని చదువుతూ వచ్చానంది. తన చెల్లి శిరీష ప్రతి తరగతిలోను పరీక్షలు రాసిందని, ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు మా స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రీధరరావుకు చెబుతుండగా అతను రాస్తున్నాడని తెలిపింది. మా స్కూల్లో ఇంగ్లీషు మాస్టారు ఛార్లెస్ స్ఫూర్తితో తాను కూడా ఇంగ్లిషు టీచరు అవ్వాలని ఉందని చెప్పింది. అంధత్వం ఆత్మవిశ్వాసానికి అడ్డుకాదని పేర్కొంది. మంచి గ్రేడుతోనే పదవతరగతి పరీక్షల్లో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. -
పదోతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
-
పదోతరగతి విద్యార్థినిపై టీచర్ అత్యాచారం
ప్రేమ పేరుతో వలవేసి.. పదో తరగతి చదివే విద్యార్థినిని లోబర్చుకుని ఆమెపై అత్యాచారం చేశాడో కీచక ఉపాధ్యాయుడు. ఈ దారుణం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఇంగ్లిషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నెల్లూరు నాగేశ్వర రావు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)తో ప్రేమయాణం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను పలుమార్లు హెచ్చరించినా ఆమె మారలేదు. రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈలోపు నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఒక లాడ్జిపై పోలీసులు దాడి చేయగా, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అయితే, అతడితో పాటు మైనర్ అమ్మాయి ఉండటంతో పోలీసులు విచారించగా అసలు విషయం తెలిసింది. వీళ్లిద్దరూ గతంలో కూడా ఇదే లాడ్జికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో లోబర్చుకున్న నాగేశ్వరరావు.. ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాయమాటలు చెప్పి తన కూతురును లొంగదీసుకున్నాడంటూ విద్యార్థిని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నెల్లూరు నాగేశ్వరరావుకు గతంలోనే పెళ్లయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
జ్ఞాపకాలే మిగిలాయి!
మార్చి 26, 2006... టోక్యో (జపాన్)... తడబడుతోన్న పాదాలను అదుపు చేసుకుంటూ మెల్లగా లోనికి ప్రవేశించాడు బిల్ హాకర్. లోలోపల ఏదో భయంగా ఉంది. ఎంతగా అణచుకుందామన్నా దుఃఖం పొంగుకొస్తోంది. ఓ క్షణం ఆగి, ఖర్చీఫ్‌తో కళ్లు ఒత్తుకున్నాడు. ‘‘బాధపడకండి అంకుల్... మీరు భయపడినట్టు ఏమీ జరగదు’’... అన్నాడు పక్కనున్న యువకుడు. తల పంకించి ముందుకు నడిచాడు బిల్. ‘‘కూర్చోండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ఇద్దరూ కూర్చున్నారు. ‘‘మా అమ్మాయి లిండ్సీ రెండు రోజు ల్నుంచి కనబడటం లేదట సర్. ఎక్కడికి వెళ్లిందో తెలియదట. నాకు భయంగా ఉంది’’... బిల్ గొంతు వణికింది. ‘‘అట అంటున్నారు. తను మీతో ఉండదా?’’ ‘‘లేదు సర్. మేం బ్రిటన్ నుంచి వచ్చాం. లిండ్సీ రెండేళ్లుగా ఇక్కడి నోవా ఇంగ్లిష్ కాన్వర్సేషన్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేస్తోంది. మరో ఇద్దరు టీచర్లతో కలిసి స్కూలు వాళ్లు ఇచ్చిన ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. రెండు రోజుల క్రితం బయటకు వెళ్లి తిరిగి రాలేదట.’’ ఇన్స్పెక్టర్ నవ్వాడు. ‘‘వయసులో ఉన్న అమ్మాయి. ఏ బాయ్ఫ్రెండ్తోనో డేట్‌కి వెళ్లి ఉంటుంది. వచ్చేస్తుందిలెండి.’’ ‘‘మర్యాదగా మాట్లాడండి సర్’’ అరిచినట్టే అన్నాడా యువకుడు. ‘‘వయసులో ఉన్న అమ్మాయైతే, ఎలా పడితే అలా తిరిగేస్తుందా?’’ ఇన్స్పెక్టర్ ముఖం సీరియస్‌గా అయ్యింది. ‘‘మీరెవరు?’’ అన్నాడు. ‘‘జాక్... లిండ్సీకి కాబోయే భర్తని.’’ ‘‘సారీ మిస్టర్ జాక్’’.. తొదరపాటుకు సిగ్గుపడుతున్నట్టుగా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘లిండ్సీ ప్రతి చిన్న విషయమూ మాకు చెప్పే చేస్తుంది సర్. మరి మాకు గానీ రూమ్మేట్స్కి గానీ చెప్పకుండా, స్కూల్లోనూ ఇన్ఫామ్ చేయకుండా రెండు రోజుల పాటు ఎక్కడికి వెళ్తుంది? తనకేదైనా అయ్యిందేమోనని కంగారుగా ఉంది’’... బిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘కంగారు పడకండి. నేను ఎంక్వయిరీ చేస్తాను. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లండి.’’ సరేనని తాము ఉంటోన్న హోటల్ వివరాలు ఇచ్చి బయలుదేరారు ఇద్దరూ. ‘‘ఏంటి ఇన్స్పెక్టర్... ఎందుకు అర్జెంట్‌గా రమ్మన్నారు? ఈ ఫ్లాట్ ఎవరిది?’’... లోపలికి అడుగు పెడుతూనే ఆతృతగా అడిగాడు బిల్. ఇన్స్పెక్టర్ జవాబు ఇవ్వలేదు. ‘‘నాతో రండి’’ అంటూ బాల్కనీ వైపు నడిచాడు. బిల్, జాక్ అతణ్ని అనుసరించారు. బాల్కనీ అంతా మురికి మురికిగా ఉంది. మొక్కలు లేని పూల కుండీలు, విరిగిన వస్తువులు.. ఏవేవో పడివున్నాయి. ‘‘మిస్టర్ బిల్... మీ అమ్మాయి జాడ తెలిసింది. తను ఇక్కడే ఉంది.’’ అయోమయంగా చూశాడు బిల్. అతని చేయి పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్. బాల్కనీలో ఓ మూలగా ఉన్న బాత్‌టబ్ దగ్గరకు తీసుకెళ్లాడు. దానివైపు చూస్తూనే కుప్పకూలిపోయాడు బిల్. బాత్ టబ్ నిండా ఇసుక ఉంది. ఆ ఇసుకలో కూరుకుపోయి ఉంది లిండ్సీ. ముఖం, ఒక చేయి మాత్రమే కనిపిస్తు న్నాయి. దేహం అప్పటికే కుళ్లిపోవడం మొదలైందన్నట్టుగా దుర్వాసన వస్తోంది. ‘‘లిండ్సీ... నా చిట్టితల్లీ... ఎంత ఘోరం జరిగింది? ఎవరు ఇంత పని చేసింది?’’ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు బిల్. అతణ్ని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఏడ్చి ఏడ్చి కాసేపటికి నెమ్మదిం చాడు. ‘‘ఇన్స్పెక్టర్... నా బిడ్డ ఎవరికేం అన్యాయం చేసింది? ఎవరు చేశారీ ఘాతుకం? వాళ్లని వదిలిపెట్టొద్దు’’... అన్నాడు స్థిరంగా. ‘‘డోన్ట్ వరీ మిస్టర్ బిల్. వాడు దొరికి నట్టే దొరికి పారిపోయాడు. కానీ ఎంత కాలం పారిపోతాడు?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ పిడికిలి బిగిస్తూ. ‘‘ఎవరు సర్ వాడు?’’... దుఃఖాన్ని దిగమింగుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు జాక్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ చెప్పిన విషయాలు విని వాళ్ల మనసుల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. ‘‘హాయ్ లిండ్సీ? ఎలా ఉన్నారు?’’ లోకల్ ట్రైన్లో కూర్చుని పుస్తకం చదువుకుంటోన్న లిండ్సీ... ఎవరో అపరిచిత వ్యక్తి తనను పలుకరించేసరికి తలెత్తి చూసింది. ‘‘నేను మీకు తెలుసా?’’ అంది అతణ్ని పరికించి చూస్తూ. తల పంకించాడా యువకుడు. ‘‘బాగా తెలుసు. మీరు నోవా స్కూల్లో ఇంగ్లిష్ టీచర్. మరో ఇద్దరు టీచర్లతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకి స్కూల్‌కి వెళ్తారు. మధ్యాహ్నం క్యాఫ్టీరియాలో లంచ్ చేస్తారు. సాయంత్రం నాలుగింటికి స్కూల్ నుంచి బయలుదేరుతారు. లోకల్ ట్రైన్లో ఇంటికి చేరుకుంటారు.’’ ఆశ్చర్యంగా చూసింది లిండ్సీ. ‘‘అంతే కాదు. మీ అపార్ట్మెంట్కి కాస్త దూరంలో ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్లో రోజూ చాకొలెట్ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాతే ఇంటికెళ్తారు. ఆ ఐస్‌క్రీమ్ అంటే మీకు పిచ్చి. అది తిని బతికేయగలరు మీరు.’’ పకపకా నవ్వింది లిండ్సీ. ‘‘ఓ మై గాడ్. నా గురించి ఇంత తెలుసా? కొంపదీసి మీరు నా సైకో లవరా? నన్ను ఫాలో అవుతున్నారా ఏంటి?’’ ఈసారి అతను నవ్వాడు. ‘‘అదేం లేదులెండి. నేను మీ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నాను. నేను పనిచేసే కంపెనీ ఏమో, మీ స్కూల్‌కి దగ్గర్లో ఉంది. పైగా మనిద్దరి పని వేళలూ ఒకటే. సో, మీరు నాకు తరచూ తారసపడతారు. అలా ఈ విషయాలు తెలిశాయి’’ అన్నాడు భుజాలు ఎగరేస్తూ. ‘‘ఇంతకూ నా పేరు చెప్పలేదు కదూ... తత్సుయా ఇషియాషీ.’’ అతను మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేసింది లిండ్సీ. హావభావాలు, ఆహార్యం అన్నీ మర్యాదగా, వినయంగా ఉన్నాయి. దాంతో మాటల్లో పడింది. రైలు దిగి అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లేవరకూ మాట్లా డుకుంటూనే ఉన్నారు. ఆమె అపార్ట్మెంట్ సమీపిస్తుండగా అతను అన్నాడు. ‘‘నాకో చిన్న సాయం చేయగలరా? నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే ఇంగ్లిష్ సరిగ్గా రాదు. నాక్కూడా ఇంగ్లిష్ నేర్పిస్తారా? కావాలంటే ఫీజు ఇచ్చేస్తాను.’’ ‘‘భలేవారే. తప్పక నేర్పుతాను. కాక పోతే దానికి మా స్కూలువారి అనుమతి కావాలి. వాళ్లనడిగి చెప్తాను’’ అని లోపలికి వెళ్లిపోయింది లిండ్సీ. అతను తన ఇంటివైపు నడక సాగించాడు. తర్వాతి రోజు మళ్లీ లోకల్ ట్రైన్లో కలిశాడు ఇషియాషీ. రైలు దిగాక ఐస్‌క్రీమ్ తిన్నారు. తర్వాత అతణ్ని తన ఇంటికి ఆహ్వానించింది లిండ్సీ. అప్పుడే తాను గీసిన లిండ్సీ బొమ్మని ఆమె ఫ్లాట్‌లో గోడకు అతికించాడు ఇషియాషీ. దానిపై తన పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ రాశాడు. స్కూలువారు అనుమతించారని, మర్నాటి నుంచే క్లాసులు మొదలుపెడతానని లిండ్సీ చెప్పడంతో పొంగిపోయాడు. మర్నాడు ఓ రెస్టారెంటులో ఇంగ్లిష్ పాఠం బోధించింది లిండ్సీ. తర్వాత ఇళ్లకు బయలుదేరారు. ‘నేను మీ ఇంటికొచ్చాను కదా, మీరూ మా ఇంటికి రండి’ అన్నాడు ఇషియాషీ. ముందు కాదన్నా, బలవంతం చేయడంతో వెళ్లింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు. అతడు క్యాజువల్‌గా ఆమెని పిలవ లేదు. అసలు ఆమెను అతడు కలవడం వెనుకే పెద్ద ప్లాన్ ఉంది. అది తెలియని లిండ్సీ అమాయకంగా వెళ్లింది. ఆ అవ కాశం కోసమే చూస్తోన్న ఇషియాషీ నిజ స్వరూపాన్ని చూపించాడు. అత్యాచారం చేయబోయాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన లిండ్సీ తిరగబడింది. దాంతో దొంగదెబ్బ తీసి ఆమెను తీవ్రంగా గాయ పర్చాడు. కోరిక తీర్చుకుని చంపేశాడు. బాత్రూమ్లో ఉన్న పాత బాత్‌టబ్‌ని బాల్కనీలోకి మార్చి ఇసుకతో నింపాడు. అందులో లిండ్సీని పూడ్చిపెట్టాడు. మనిషిని సమాధి చేయగలిగాడు కానీ, సాక్ష్యాలను చేయలేకపోయాడు. కంప్లయింట్ రాగానే పోలీసులు లిండ్సీ ఫ్లాట్‌కి వెళ్లారు. అక్కడ లిండ్సీ గదిలోని బొమ్మ మీద ఇషియాషీ వివరాలు కనిపిం చాయి. దాంతో అతని ఫ్లాట్‌కి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో మాటు వేశారు. రాత్రి అయ్యాక ఇంట్లో లైటు వెలిగినట్టు అనిపించింది. బయట తాళం పెట్టి, కిటికీ ద్వారా లోపలికెళ్లి దాక్కున్నాడని అర్థమై పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ అతను చిక్కలేదు. తప్పించుకున్నాడు. ఇల్లంతా సోదా చేస్తే బాల్కనీలోని తొట్టిలో లిండ్సీ మృతదేహం కనిపించింది. ‘‘ఇలాంటి రాక్షసులు ఉంటారనే నా కూతురికి కరాటే కూడా నేర్పించాను సర్. అయినా ఇలా జరిగింది. తన మనసు చాలా మంచిది. అంత మంచిదానికి ఎవరు చెడు చేస్తారులే అన్న ధైర్యంతో ఇంత దూరం పంపించాను. కానీ మంచి కంటే చెడుకి బలం ఎక్కువ అని మరోసారి నిరూపణ అయ్యింది.’’ మనసు చివుక్కుమంది ఇన్స్పెక్టర్కి. ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాడు... ఎలాగైనా ఆ తండ్రికి న్యాయం చేయాలి, లిండ్సీ ఆత్మకి శాంతి కలిగించాలి అని. చివరికి అనుకున్నది సాధించాడు. ఇషియాషీని పట్టుకున్నాడు. కోర్టులో నిలబెట్టి జీవిత ఖైదు వేయించాడు. తీర్పు వెలువడిన రోజు లిండ్సీ సమాధి దగ్గరకు వెళ్లాడు బిల్. ‘‘క్షమించు తల్లీ. కన్నవాడిగా నిన్ను కాపాడుకోలేక పోయాను. నిన్ను కడతేర్చినవాడికి కనీసం మరణశిక్ష కూడా వేయించలేకపోయాను. తండ్రిగా నేను ఓడిపోయాను. నన్ను క్షమించు’’ అంటూ విలపించాడు. అతడి అశ్రుధారలు లిండ్సీ సమాధిని తడిపే శాయి. బహుశా ఆ క్షణం... స్వర్గంలో ఉన్న లిండ్సీ కళ్లు కూడా తడిసే ఉంటాయి! - సమీర నేలపూడి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపం మార్చేసుకున్నాడు ఇషియాషీ. దాంతో అతని పోస్టర్లు నగరమంతా అంటించినా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. చివరికి ఓ డిటెక్టివ్ సాయంతో మూడేళ్లకు పట్టుకో గలిగారు పోలీసులు. ప్రస్తుతం జపాన్ లోని ఓ జైల్లో జీవితై ఖెదును అనుభ విస్తున్నాడు ఇషియాషీ. తనను క్షమించ మంటూ లిండ్సీ తండ్రికి ఓ లేఖ రాశాడు. ‘అన్టిల్ ఐ వజ్ అరెస్టెడ్’ అనే పుస్తకం రాసి, దానిపై వచ్చే రాయల్టీ అంతా లిండ్సీ కుటుంబానికి చెందేలా చేశాడు. కానీ ఆ రాయల్టీని, అతని క్షమాపణని కూడా లిండ్సీ కుటుంబం తిరస్కరించింది. -
విద్యార్థిని మృతి కేసులో ఇంగ్లిష్ టీచర్ సస్పెన్షన్
మచిలీపట్నం : చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని మృతి కేసులో నిందితుడైన ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు చిరువోలు జనార్దనప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం డీఈవో కె.నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వక్కలగడ్డ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు మలుపెద్ది శివరామప్రసాద్‌తో కలిసి చిరువోలు జనార్దనప్రసాద్ బాలికను లోబర్చుకుని ఆమె మృతికి కారణమయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం వక్కలగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న జనార్దనప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు. -
కీచక గురువులకు రిమాండ్
చల్లపల్లి : జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన వక్కలగడ్డకు చెందిన ఇంటర్ విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచర్‌ను ఆదివారం అవనిగడ్డలోని ఏజేఎఫ్‌సీఎంఈ జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థిని రెండు నెలల కిందట అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామప్రసాద్, అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ చిరువోలు జనార్దనప్రసాద్‌ను లైంగికదాడి, పోస్కో చట్టాల కింద శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సెలవు కావడంతో అవనిగడ్డలో ని మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం కీచక గురువు అరెస్ట్ ఉదంతాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్ని పలువురు మహిళా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల మహిళా నేతలు అదివారం చల్లపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులిద్దరిపై వైఎస్సార్సీపీ మండల మహిళా కన్వీనర్ వల్లూరి ఉమ, నాయకురాలు బొందలపాటి లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కఠినంగా శిక్షించాలి విద్యార్థిని మృతికి కారకులైన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు వల్ల విద్యార్థినులు చదువు కోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. - వల్లూరి ఉమ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, చల్లపల్లి అవార్డును వెనక్కి తీసుకోవాలి ఈ కేసులో తాతయ్య వయస్సు అయిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామ ప్రసాద్‌కు గతంలో వచ్చిన జాతీయ ఉత్తమ అవార్డును వెనక్కి తీసుకోవాలి. మరో ఉపాధ్యాయుడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని జీవితాన్ని సగంలోనే బుగ్గిపాలు చేసిన ఈ ఇద్దరినీ కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలి. - బొందలపాటి లక్ష్మి,వైఎస్సార్సీపీ నాయకురాలు, చల్లపల్లి -
‘కీచక’ టీచర్ల అరెస్ట్
నిందితుల్లో ఒకరు రిటైర్డ్ {పధానోపాధ్యాయుడు, మరొకరు ఇంగ్లిష్ టీచర్ ‘పోస్కో’ కింద కేసు నమోదు చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లైంగిక దాడి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చల్లపల్లి : జిల్లాలో సంచలనం కలిగించిన చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన విద్యార్థిని మృతికి కారకులైన రిటైర్డ్ హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడిని శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ వై.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని మరణం విషయం గతంలో తమ దృష్టికి రాలేదని, దీనిపై బాధిత కుటుంబీకులు కూడా ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తల అనంతరం ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ ఎం.అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వీరిపై విచారణ నిర్వహించినట్లు తెలిపారు. శారీరక సంబంధాలతోనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి వక్కలగడ్డకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని(16)ని గతంలో అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన మల్లుపెద్ది శివరామప్రసాద్, ప్రస్తుతం ఇదే పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చిరువోలు జనార్దనప్రసాద్ లోబరచుకుని పలుసార్లు శారీరకంగా సంబంధాలు కొనసాగించినట్టు కేసు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. మైనర్ అయిన ఆ విద్యార్థినిని వారు శారీరకంగా ఎక్కువసార్లు కలవడం వల్ల అనారోగ్యానికి గురైందని చెప్పారు. బాలికను ముందుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి తీసుకెళ్లిపొమ్మని చెప్పారన్నారు. తరువాత మరో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గత అక్టోబర్ 17న మరణించినట్టు తెలిపారు. ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసుపై ప్రాథమిక విచారణలో ఈ విషయాలు రుజువైనట్టు చెప్పారు. ఈ మేరకు లైంగికదాడి, పోస్కో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సెక్స్యువల్ అఫెన్సెస్ యాక్టు) కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ ఆదివారం అవనిగడ్డలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. సమావేశంలో సీఐ దుర్గారావు, ఎస్సై వై.సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏబీవీపీ ఫిర్యాదుతో... వక్కలగడ్డ జెడ్పీ హైస్కూల్లో పీఈటీ ఓ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో గత అక్టోబర్ 17న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు శివరామప్రసాద్ వల్ల ఈ పాఠశాలలో చదివిన విద్యార్థిని చనిపోయిందని, దీనిపై విచారణ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై మూడురోజుల తరువాత డీవైఈవో విచారణకు రాగా.. కొంతమంది నాయకుల ఒత్తిళ్ల మేరకు గతంలో ఆరోపణలు చేసిన నాయకులు విచారణకు హాజరు కాలేదు. అప్పట్లో ‘సాక్షి’లో దీనిపై కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల వీటిపై స్పందించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై తాజాగా నాలుగురోజుల నుంచి పత్రికల్లో పలు కథనాలు రావడం, ఏబీవీపీ ఆందోళన, కేసు నమోదు, ఎస్ఎఫ్ఐ ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమాలతో విద్యార్థిని మృతి ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు మేరకు సీఐ దుర్గారావు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం డీఎస్పీ ఆదేశాలు మేరకు రిటైర్డ్ హెడ్మాస్టర్, ఇంగ్లిష్ టీచర్‌ను శనివారం అరెస్టు చేశారు. బాలల పరిరక్షణ జిల్లా అధికారి విచారణ శిశు సంక్షేమశాఖ ఆదేశాల మేరకు బాలల పరిరక్షణ జిల్లా అధికారి విజయకుమార్ వక్కలగడ్డ హైస్కూల్లో శనివారం పలువురు ఉపాధ్యాయులు, సీఐ దుర్గారావు నుంచి, స్థానిక పోలీస్ స్టేషన్లో జనార్దన ప్రసాద్ నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థిని మృతి ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ విచారణ నిర్వహించినట్లు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మల పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడి దాడిలో విరిగిన విద్యార్థి చేయి
ఖిలావరంగల్ : హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో చితకబాదగా ఆమె చేయి విరిగిన సంఘటన చింతల్‌లోని ఇండియన్ హైస్కూల్లో బుధవారం సాయంత్రం జరిగింది. విద్యార్థి బంధువుల కథనం ప్రకారం.. చింతల్ ప్రాంతానికి చెందిన ఎలకంటి రాజు, ఇంద్ర దంపతుల కుమారుడు శివప్రసాద్ పుప్పాలగుట్టలోని ఇండియన్ హైస్కూల్ 8వ తరగతి చదువుతున్నాడు. చెప్పిన హోంవర్క్ చేయలేదని కోపగించుకున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు హరి బుధవారం సాయంత్రం కర్రతో శివప్రసాద్‌ను చితకబాదగా చేయి విరిగింది. దీంతో సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని శివప్రసాద్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా విద్యార్ధిని చితకబాదిన ఉపాధ్యాయుడిపై చట్టమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన అధిక వడ్డీ
బిజినేపల్లి: వడ్డీ వ్యాపారి దాష్టీకానికి ఓ యువకుని ప్రాణం బలైంది.. చేసిన అప్పునకు అధిక వడ్డీ చెల్లించలేక ఉన్న ఇంటి స్థ లం అక్రమంగా లాక్కోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకా రం... మండలంలోని మం గనూరుకు చెందిన గడ్డపార సతీష్ (32) పీజీ వర కు చదువుకుని స్థాని కంగా ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య మహేశ్వరితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆర్థిక ఇబ్బం దులు ఎదురవటంతో బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఏడాదిన్నర క్రితం రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. మంగనూర్లో ఓ ప్రైవేటు పాఠశాలను స్థాపించి రోజుకు రూ.వెయ్యి వడ్డీ చొప్పున 45 రోజుల్లో రూ.45వేలు చెల్లించాడు. సకాలంలో అధిక వడ్డీకి అప్పు తీర్చలేక పాఠశాల మూతపడి పొట్టచేతపట్టుకుని ఏడాదిక్రితం హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. మూడు నెలలక్రితం స్వగ్రామానికి తిరిగిరాగా తన కున్న 142 గజాల ఇంటి స్థలాన్ని వడ్డీ వ్యాపారి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అం దులో ఉన్న కుందేళ్ల షెడ్ జాలీలు, ఇతరత్రా సామగ్రిని సైతం అప్పు కిందికి వడ్డీ వ్యాపారి లాక్కున్నాడు. దీంతో మనోవేదన కు గురైన సతీష్ సూసైడ్ నోట్ రాసి గురువారం మధ్యాహ్నం బిజినేపల్లిలోని బాలికల జెడ్పీహెచ్ఎస్ సమీపంలోకి వచ్చి పురుగుమందు తాగాడు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి ఎస్ఐ నరేష్ చేరుకుని బాధితుడిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు, బంధువులు బోరుమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వడ్డీ వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ఇంగ్లీష్ టీచరే ఫ్యాషన్ గురువు
నాస్కూల్ డేస్‌లో టీచర్లంతా చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవారు. వారందరిలో ఇంగ్లీష్ టీచర్ మరీ ప్రత్యేకంగా ఉండేది. 9గజాల చీరతో ఎంత అద్భుతంగా కనపడేదంటే కళ్లార్పడం మరచిపోయేదాన్ని. పొడవుగా, స్లిమ్‌గా ఉండే ఆమెకు ఏ చీరైనా బాగా నప్పేది. నేను రకరకాల చీరల్లో ఆమెను చూస్తూ ఆమెకు ఎలాంటి డిజైన్లు బాగుంటాయో ఊహించుకునేదాన్ని. నాలో చీర మీద ఆసక్తితో పాటు డిజైనింగ్‌ని కెరీర్‌గా మార్చుకోవడానికి కూడా ఆమే కారణమేమో అనిపిస్తోంది. ఓ రకంగా ఫ్యాషన్ రంగంలో ఆమే నాకు గురువు అని చెప్పాలి. ఫ్యాషన్ స్కూల్ నడుపుతూ నేనూ టీచర్ పాత్రకు మారా. ఆమెలానే చీరకట్టుకే ప్రాధాన్యమిస్తున్నా - ఆయేషాలఖోటియా, లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఏకలవ్య శిష్యురాలిని డిజైనర్లు రోహిత్‌బాల్, సవ్యసాచిలకు ఏకలవ్య శిష్యురాలిని నేను. ఇద్దరినీ పరిశీలిస్తూ నా డిజైనింగ్‌లో మెరుగులు దిద్దుకున్నాను. వీరిలో రోహిత్‌బాల్ ఒక నిజమైన కొచూరియర్ అయితే సవ్యసాచి భారతీయ ఫ్యాబ్రిక్స్‌కి సమకాలీన శైలిని అద్దడంలో దిట్ట. ఎప్పటికప్పుడు ప్రపంచ విపణి మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకునే ఈ ఫ్యాషన్ సామ్రాట్టుల పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను. వీరిద్దరూ నాకు ఎప్పుడూ స్ఫూర్తి ప్రదాతలే. అంతేకాదు నేను డిజైనింగ్ కోర్సు చేసి నిఫ్ట్లోనే వీరు నాకు సీనియర్స్ కావడం కూడా ఒక విశేషం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకంటూ ఒక స్థానం తెచ్చుకున్న తర్వాత సవ్యసాచిని ఒకసారి కలవగలిగాను. ఆ అపురూప సందర్భం నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను. - ఇషితాసింగ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
ఇంగ్లీష్ టీచరే ఫ్యాషన్ గురువు
నాస్కూల్ డేస్‌లో టీచర్లంతా చక్కగా చీరలు కట్టుకుని వచ్చేవారు. వారందరిలో ఇంగ్లీష్ టీచర్ మరీ ప్రత్యేకంగా ఉండేది. 9గజాల చీరతో ఎంత అద్భుతంగా కనపడేదంటే కళ్లార్పడం మరచిపోయేదాన్ని. పొడవుగా, స్లిమ్‌గా ఉండే ఆమెకు ఏ చీరైనా బాగా నప్పేది. నేను రకరకాల చీరల్లో ఆమెను చూస్తూ ఆమెకు ఎలాంటి డిజైన్లు బాగుంటాయో ఊహించుకునేదాన్ని. నాలో చీర మీద ఆసక్తితో పాటు డిజైనింగ్‌ని కెరీర్‌గా మార్చుకోవడానికి కూడా ఆమే కారణమేమో అనిపిస్తోంది. ఓ రకంగా ఫ్యాషన్ రంగంలో ఆమే నాకు గురువు అని చెప్పాలి. ఫ్యాషన్ స్కూల్ నడుపుతూ నేనూ టీచర్ పాత్రకు మారా. ఆమెలానే చీరకట్టుకే ప్రాధాన్యమిస్తున్నా - ఆయేషాలఖోటియా, లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఏకలవ్య శిష్యురాలిని డిజైనర్లు రోహిత్‌బాల్, సవ్యసాచిలకు ఏకలవ్య శిష్యురాలిని నేను. ఇద్దరినీ పరిశీలిస్తూ నా డిజైనింగ్‌లో మెరుగులు దిద్దుకున్నాను. వీరిలో రోహిత్‌బాల్ ఒక నిజమైన కొచూరియర్ అయితే సవ్యసాచి భారతీయ ఫ్యాబ్రిక్స్‌కి సమకాలీన శైలిని అద్దడంలో దిట్ట. ఎప్పటికప్పుడు ప్రపంచ విపణి మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకునే ఈ ఫ్యాషన్ సామ్రాట్టుల పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేను. వీరిద్దరూ నాకు ఎప్పుడూ స్ఫూర్తి ప్రదాతలే. అంతేకాదు నేను డిజైనింగ్ కోర్సు చేసి నిఫ్ట్లోనే వీరు నాకు సీనియర్స్ కావడం కూడా ఒక విశేషం. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకంటూ ఒక స్థానం తెచ్చుకున్న తర్వాత సవ్యసాచిని ఒకసారి కలవగలిగాను. ఆ అపురూప సందర్భం నేనెప్పటికీ గుర్తుంచుకుంటాను. - ఇషితాసింగ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్