
ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేస్తున్న గ్రామస్తులు
వి.కోట: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణ పరిధిలోని ఖాజీపేట ఉర్దూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సోమవారం గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో తిరుమల ప్రసాద్ అనే ఇంగ్లీష్ టీచర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. తప్పుడు మాటలతో వేధించినట్లు వాపోయారు. బాధిత బాలికలు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని నిందితుడిని చెట్టుకు తాళ్లతో కట్టి దేహశుద్ధి చేశారు.
ఇంతకు ముందు కూడా సదరు ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో అమ్మాయిలను వేధించిన కేసులో 3సంవత్సరాలు సస్పెండై కొద్దిరోజుల క్రితమే మళ్లీ విధుల్లో చేరాడు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ రవిప్రకాష్ స్పందించి ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తరలించారు.