Vulgar behavior
-
అశ్లీల కథలు బిగ్గరగా చదవాలంటూ.. మెడికల్ కాలేజీల్లో హద్దులు దాటిన ర్యాగింగ్
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై దేశంలోని వైద్యులంతా నిరసనలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు కొనసాగున్న తరుణంలో.. మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకుని, కాలేజీల్లో చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు పరిధులు దాటి ర్యాంగింగ్ చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల ప్రకారం మెడికల్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారు. వారి చేత అశ్లీల పుస్తకాలలోని కథలను బిగ్గరగా చదివిస్తూ, వాటిని గుర్తుపెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు.స్త్రీలపై లైంగిక హింసకు పాల్పడే కథలను జూనియర్ల చేత సీనియర్లు చదివిస్తున్నారు. నిజానికి సీనియర్ వైద్యు విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా సీనియర్ విద్యార్థులు ప్రవర్తిన్నున్న తీరు కనిపిస్తోంది. అలాగే బోర్డుపై అశ్లీల పదాలను రాసి, వాటిని బిగ్గరగా చదవమంటున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఇటువంటి సందర్భాల్లో జూనియర్లు వెనుకాడితే సీనియర్లు నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటారని తెలుస్తోంది. బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు జాస్మిన్ పతేజా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో ర్యాగింగ్ చేసే అంశాలు అత్యాచారాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రోగులను చూసి కొందరు అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు నీచంగా మాట్లాడటాన్ని చూశానని ఓ సీనియర్ మహిళా డాక్టర్ మీడియా ముందు వాపోయారు.ఇది కూడా చదవండి: ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి... -
కీచక టీచర్‌కు దేహశుద్ది
-
కీచక టీచర్ మారలేదు.. గ్రామస్తులు వదల్లేదు..
వి.కోట: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణ పరిధిలోని ఖాజీపేట ఉర్దూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి సోమవారం గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో తిరుమల ప్రసాద్ అనే ఇంగ్లీష్ టీచర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. తప్పుడు మాటలతో వేధించినట్లు వాపోయారు. బాధిత బాలికలు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని నిందితుడిని చెట్టుకు తాళ్లతో కట్టి దేహశుద్ధి చేశారు. ఇంతకు ముందు కూడా సదరు ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో అమ్మాయిలను వేధించిన కేసులో 3సంవత్సరాలు సస్పెండై కొద్దిరోజుల క్రితమే మళ్లీ విధుల్లో చేరాడు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ రవిప్రకాష్ స్పందించి ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తరలించారు. -
రెండో తరగతి విద్యార్ధిని పట్ల పీఈటీ అసభ్య ప్రవర్తన
-
టీడీపీ నేత అధికారం వుందని అహకారంతో..
-
విద్యార్థినులపై ఇన్విజిలేటర్ అసభ్యకర ప్రవర్తన
చీఫ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసిన బాలికలు నర్మెట : ఇంటర్మీడియట్ పరీక్ష ల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించారని విద్యార్థులు స్థానిక కళాశాల ప్రిన్సిపాల్, ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరిం టెండెంట్ రాంచంద్రయ్యకు ఫిర్యాదు చేశారు. నర్మెట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేం ద్రంలో మూడు కళాశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. గురువారం పరీక్ష సమయంలో ఇద్దరు విద్యార్థులు బాత్రూంకు వెళ్లగా... వారి వెంబడి ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెళ్లి, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిం చాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై చీఫ్ సూపరిండెంట్‌ను సంప్రదించగా... విద్యార్థులు ఫిర్యాదు చేసింది వాస్తవమేనన్నారు. సదరు ఉపాధ్యాయుడిని పరీక్ష విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం పోలీసులకు అప్పగింత తొర్రూరులో ఘటన తొర్రూరుటౌన్ : విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చిత్రహింసలకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిని బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు చితకబాదిన సంఘటన మండల కేంద్రంలోని రత్న టెక్నో స్కూల్లో బుధవారం జరిగింది. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆర్. రమేష్ అదే పాఠశాలలో చదివే విద్యార్థినితో రోజూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. పాఠశాల సమయంలో అయిపోయాక కూడా క్లాస్‌లోనే ఉంచి చెప్పరాని చోటల్లా తాకుతూ ఇబ్బందికి గురిచేసేవాడు. ఈ బాధ భరించలేక బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బు దవారం పాఠశాలకు చేరుకుని రమేష్‌ను చితకబాదారు. పాఠశాల హెచ్ఎం అతడిని కాపాడే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాలలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వి ద్యార్థులు ఆందోళనకు గురై బోరున విలపించారు. పోలీ సులు రంగప్రవేశం చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసి, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడు మేకల కుమార్, పీడీఎస్‌యూ డివిజన్ నాయకుడు యాకయ్య, ఏఐపీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.