న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై దేశంలోని వైద్యులంతా నిరసనలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇటువంటి ఘటనలు కొనసాగున్న తరుణంలో.. మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకుని, కాలేజీల్లో చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు పరిధులు దాటి ర్యాంగింగ్ చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల ప్రకారం మెడికల్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారు. వారి చేత అశ్లీల పుస్తకాలలోని కథలను బిగ్గరగా చదివిస్తూ, వాటిని గుర్తుపెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు.
స్త్రీలపై లైంగిక హింసకు పాల్పడే కథలను జూనియర్ల చేత సీనియర్లు చదివిస్తున్నారు. నిజానికి సీనియర్ వైద్యు విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా సీనియర్ విద్యార్థులు ప్రవర్తిన్నున్న తీరు కనిపిస్తోంది. అలాగే బోర్డుపై అశ్లీల పదాలను రాసి, వాటిని బిగ్గరగా చదవమంటున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.
ఇటువంటి సందర్భాల్లో జూనియర్లు వెనుకాడితే సీనియర్లు నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటారని తెలుస్తోంది. బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు జాస్మిన్ పతేజా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో ర్యాగింగ్ చేసే అంశాలు అత్యాచారాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రోగులను చూసి కొందరు అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు నీచంగా మాట్లాడటాన్ని చూశానని ఓ సీనియర్ మహిళా డాక్టర్ మీడియా ముందు వాపోయారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి...
Comments
Please login to add a commentAdd a comment