ragging in colleges
-
అశ్లీల కథలు బిగ్గరగా చదవాలంటూ.. మెడికల్ కాలేజీల్లో హద్దులు దాటిన ర్యాగింగ్
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై దేశంలోని వైద్యులంతా నిరసనలు చేపట్టారు. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు కొనసాగున్న తరుణంలో.. మెడికల్ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్ తీసుకుని, కాలేజీల్లో చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు పరిధులు దాటి ర్యాంగింగ్ చేస్తున్న వైనాలు వెలుగు చూస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల ప్రకారం మెడికల్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారు. వారి చేత అశ్లీల పుస్తకాలలోని కథలను బిగ్గరగా చదివిస్తూ, వాటిని గుర్తుపెట్టుకోవాలని బలవంతం చేస్తున్నారు.స్త్రీలపై లైంగిక హింసకు పాల్పడే కథలను జూనియర్ల చేత సీనియర్లు చదివిస్తున్నారు. నిజానికి సీనియర్ వైద్యు విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా సీనియర్ విద్యార్థులు ప్రవర్తిన్నున్న తీరు కనిపిస్తోంది. అలాగే బోర్డుపై అశ్లీల పదాలను రాసి, వాటిని బిగ్గరగా చదవమంటున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు.ఇటువంటి సందర్భాల్లో జూనియర్లు వెనుకాడితే సీనియర్లు నవ్వుతూ వారిని ఎగతాళి చేస్తుంటారని తెలుస్తోంది. బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు జాస్మిన్ పతేజా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జూనియర్లతో ర్యాగింగ్ చేసే అంశాలు అత్యాచారాలను ప్రోత్సహించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్ టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రోగులను చూసి కొందరు అనస్థీషియాలజిస్టులు, సర్జన్లు నీచంగా మాట్లాడటాన్ని చూశానని ఓ సీనియర్ మహిళా డాక్టర్ మీడియా ముందు వాపోయారు.ఇది కూడా చదవండి: ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి... -
Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
Viral Video: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్ పైశాచికత్వం!
బరంపురం: ర్యాగింగ్ వికృత క్రీడాకు ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు బలైన విషయం తెలిసిందే. తాజాగా ర్యాగింగ్‌లో భాగంగా కొందరు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ షాకింగ్ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. బరంపురం నగరంలోని సుకుండా ప్రాంతం బినాయక్ ఆచార్య డిగ్రీ కళాశాలలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు బరంపురం ఎస్పీ సరవణ్ వివేక్ వెల్లడించారు. కళాశాలకు చెందిన విద్యార్థినిని బుధవారం ర్యాగింగ్ చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. In Binayak acharya college campus what's going sir @SP_BERHAMPUR In simple word it's called ragging But ragging have one level They cross the level One guy beat to one and force to him for intimate in front of all Humble request sir take action aganaist culprit. pic.twitter.com/rttXdWUmRx — lord (@lordvinx_1) November 16, 2022 విషయం తెలుసుకున్న ఎస్పీ.. సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా పెద్దబజార్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఐఐసీ అధికారి భూపతి మహంతి, సిబ్బంది కళాశాలలో గురువారం విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులను నిందితులుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. వీరిలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న అభిషేక్ నాయక్, బబులా పండా, మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని ఐఐసీ వివరించారు. Berhampur: 2 students of Binayak Acharya College held as video of ragging junior girl goes viral https://t.co/wEwfwTVXqM — Sambad English (@Sambad_English) November 17, 2022 -
ర్యాగింగ్ రాక్షసి
సాక్షి, పార్వతీపురం,(విజయనగరం) : టీనేజ్‌లో రంగుల ప్రపంచం. బాధ్యతలు తెలియని ప్రాయం. చిన్న బాధకు కందిపోయే మనస్సు. అప్పుడే ఆకర్షణలకు లోనవుతున్నారు. కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు.. కొత్త కొత్త బైకుల్ని చూసి మనసు పారేసుకుంటారు. బ్రాండెడ్ డ్రెస్‌లు కొని ధరించాలని ఉవ్విళ్లూరుతారు. ఇవన్నీ దొరకాలంటే.. చేతినిండా పైసలు కావాలి. టీనేజ్ యువత సులభ సంపాదనకు అలవాటు పడుతోంది. ఇందులో భాగంగా తోటి విద్యార్థులను వేధించడం, సీనియర్లు జూనియర్లతో ఖర్చులు పెట్టించడం, కొత్తగా కళాశాల్లో చేరే అమాయక విద్యార్థుల బలహీనతను కనిపెట్టి వారిని బెదిరించి ఖర్చు పెట్టించడం.. ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమయ్యాయి. కళాశాలల్లో ర్యాగింగ్ వెర్రి తలలు వేస్తోంది. పోలీసులు మహిళా రక్షక్ పేరిట కమిటీలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి చెందేలా.. ర్యాగింగ్ నిరోధించేలా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కథనమిది. కళాశాలలు, వసతిగృహాలు, క్యాంపస్‌ల ఆవరణల్లో వివిధ రూపాల్లో ర్యాగింగ్ సాగుతోంది. గతంలో పలుచోట్ల బాలికల వసతిగృహాల్లోను ఈ దుమారం రేగడం తెలిసిందే. గత ఏడాది విజయనగరం పట్టణంలో విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే పోలీసులు బుద్ధి చెప్పడం తెలిసిందే. వివిధ కారణాలతో ఇలాంటివి ఒకటి, రెండు మాత్రమే బయటికి వస్తున్నాయి.కళాశాల బయట ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సీనియర్లే కాకుండా... బయటి వ్యక్తులు కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు చూసీ చూడనట్టు ఉండటంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఎవరైనా కామెంట్ చేస్తే గట్టిగా ఎదిరించాలని.. బహిరంగ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెట్టాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు ఆడపిల్లలు వెళ్లే సమయాల్లో బస్సులో ప్రయాణించే కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, ద్వందార్థాలతో వారిని కించపరచడం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆడపిల్లలు ఫిర్యాదు చేయాలి. లేదంటే ఏడాది పొడవునా ఆకతాయిలు రెచ్చిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ర్యాగింగ్ నిరోధానికి కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే వారు దీన్ని ప్రోత్సహించినట్టు భావించి శిక్షించాలని చట్టం చెబుతోంది. దీనికి కళాశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ కమిటీలోని అధ్యాపకులు, వార్డెన్ బాధ్యులే. దీనికి తోడు ఇలాంటి కళాశాలలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలను నిలిపివేస్తారు.ర్యాగింగ్‌కు పాల్పడితే బాధితులు ఫిర్యాదు చేయాలి. విద్యార్థులు క్రమ శిక్షణను అలవరచుకోవాలి. యాజమాన్యాలు సైతం ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలివి.. దేశ వ్యాప్తంగా ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రచారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దీని సిఫార్సులను విధిగా అమలు చేయాలి. కళాశాలకు కొత్తగా వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఆయా కళాశాలల్లో విస్తృతంగా నిర్వహించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్ నిరోధక పర్యవేక్షణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. పోలీసుల టోల్ ఫ్రీ నంబరు విద్యార్థులు ర్యాగింగ్‌కు గురైతే వెంటనే 100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కంట్రోల్ రూమ్ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు నేరుగా తెలపొచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ మానవ నవరుల శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 18001805522కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. సంఘటన జరిగిన వెంటనే బాధితులు లేదా స్నేహితులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించొచ్చు. బాధితుల పేరు, ప్రాంత కంట్రోల్ రూమ్‌లో నమోదవుతాయి. అక్కడి అధికారులు తక్షణమే స్పందించి సంస్థ, విశ్వవిద్యాలయం అధికారులకు సమాచారం ఇస్తారు. సంఘటన తీవ్రమైందని భావిస్తే కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలకు సమాచారం అందిస్తారు. తీసుకోవలసిన జాగ్రత్తలు కళాశాల నోటీసు బోర్డులో ర్యాగింగ్ నిరోధక హెల్ప్‌లైన్ నంబరు ఉండాలి. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. ప్రిన్సిపల్ ఆయా విభాగాల అధిపతులు, కమిటీ సభ్యులు, స్క్వాడ్ సబ్ డివిజన్ జిల్లా పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా కళాశాలల్లో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి కళాశాలలో మనస్తత్వ నిపుణుడిని నియమించాలి. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ప్రచురించాలి. -
బీసీ హాస్టల్లో ర్యాగింగ్
నిజామాబాద్, నాగారం : జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. నాందేవ్‌వాడలోని బీసీ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధించడంతో వారిపై కేసు నమోదైంది. నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు బీసీ వసతిగృహంలో వసతి పొందుతున్నారు. అయితే, కొంద రు డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు జూనియర్లను తరచూ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. గిరిరాజ్ కాలేజ్, నిశిత డిగ్రీ కాలేజ్‌లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు వినోద్, శ్రీకాంత్, రాజు, ప్రీతమ్ కొన్నాళ్లుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నా రు. సెకండియర్ విద్యార్థులను పిలిచి వారిని వేధిస్తున్నారు. హాస్టల్లో ఉన్న మూత్రశాలలు, మరు గుదొడ్లు శుభ్రం చేయాలని, సీనియర్లు తిన్న ప్లేట్లను కడగాలని వేధిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని జూనియర్లు తెలిపారు. వేధింపులు మరీ ఎక్కువ కావడంతో చివరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విష యం తెలిసిన హాస్టల్ వార్డెన్ బాలకృష్ణ విద్యార్థులను వెంట బెట్టుకొని ఆదివారం మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదు పులోకి తీసుకున్నారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. చెప్పినా మార్పు రాలేదు.. ర్యాగింగ్ జరుగుతున్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. రాత్రుల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ విద్యార్థులకు శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. అందుకే జూనియర్లతో కలిసి 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – బాలకృష్ణ, వార్డెన్ బెదిరించే వారు.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు సెకండియర్ విద్యార్థులను ర్యాగిం గ్ చేస్తున్నారు. రోజూ మూత్రశాలలు కడిగించడం, మరుగుదొడ్లు కడిగించడం వంటివి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేధించవద్దని ఎన్నిసార్లు కోరినా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని వార్డెన్‌కు చెప్పాం. వార్డెన్ ముందే మాపై దాడి చేశారు. హాస్టల్లో ర్యాగింగ్ జరగకుండా చూడాలి. – నరేశ్, డిగ్రీ సెకండియర్ విద్యార్థి -
దివాకర్‌రెడ్డి బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్
జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ – ఉద్యాన కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ జరిగింది. జూనియర్ల పట్ల సీనియర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. సీనియర్ల తీరును నిరసిస్తూ బాధితులు జూనియర్లతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన కళాశాల కావడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని రావి వెంకటాంపల్లి సమీపంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ – ఉద్యాన కళాశాలకు చెందిన బాయ్స్ హాస్టల్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో హాస్టల్లోని సీనియర్ విద్యార్థులు, డేస్కాలర్స్ విద్యార్థులు హార్టికల్చర్ విద్యార్థిని షేవింగ్ చేయించుకోవాలంటూ ర్యాగింగ్ చేశారు. అందుకు ప్రతిఘటించిన హార్టికల్చర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేశారు. వారించిన మరికొంత మంది జూనియర్లను కూడా ఒంటిపై దుస్తులు లేకుండా చేసి దాదాపు నాలుగు గంటల పాటు మోకాళ్లపై మట్టిలో నిల్చోబెట్టి అసభ్యకరంగా ప్రవర్తించారు. సీనియర్లపై చర్యలు తీసుకోండి ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు తోటి విద్యార్థుల సహాయంతో శనివారం ఉదయం కళాశాల అసోసియేట్ డీన్‌కు ఫిర్యాదు చేశారు. సానుకూల స్పందన లభించకపోవడంతో విద్యార్థులు కళాశాలలోనే ఆందోళనకు దిగారు. తరగతుల్లోకి వెళ్లకుండా మూ డు గంటల పాటు ఆందోళన చేశారు. డీన్ గదిలో రహస్యంగా విచారణ చేస్తున్న ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి రహస్య విచారణ విద్యార్థుల ఆందోళన గురించి సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి స్పెషల్‌పార్టీ పోలీసులతో వ్యవసాయ కళాశాలకు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని కరస్పాండెంట్ రెడ్డప్పరెడ్డి గదిలోకి తీసుకెళ్లి రహస్యంగా విచారించారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. జరిగిన ఘటనపై నోరుమెదపకుండా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ర్యాగింగ్ జరిగిన విషయం బయటకు చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
ర్యాగింగ్‌ను కఠినంగా అణిచేస్తాం: గవర్నర్
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆయన రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్‌ను కఠినంగా అణిచేస్తామని ఆయనకు తెలిపారు. ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ర్యాగింగ్‌ను అరికట్టాలని విద్యాశాఖ మంత్రులతో మాట్లాడామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్ జరగడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు దాన్ని అధిగమిస్తామని కేంద్ర హోం మంత్రికి నరసింహన్ చెప్పినట్లు తెలిసింది.