5 students of Berhampur's Binayak Acharya College Arrested for Ragging
Sakshi News home page

Viral Video: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్‌ పైశాచికత్వం!

Published Fri, Nov 18 2022 8:46 AM | Last Updated on Fri, Nov 18 2022 9:09 AM

Five Students Of Binayak Acharya College Arrest For Ragging Juniors - Sakshi

బరంపురం: ర్యాగింగ్‌ వికృత క్రీడాకు ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు బలైన విషయం తెలిసిందే. తాజాగా ర్యాగింగ్‌లో భాగంగా కొందరు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ షాకింగ్‌ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. బరంపురం నగరంలోని సుకుండా ప్రాంతం బినాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో చోటు చేసుకున్న ర్యాగింగ్‌ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు బరంపురం ఎస్పీ సరవణ్‌ వివేక్‌ వెల్లడించారు. కళాశాలకు చెందిన విద్యార్థినిని బుధవారం ర్యాగింగ్‌ చేస్తున్నట్లు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

విషయం తెలుసుకున్న ఎస్పీ.. సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా పెద్దబజార్‌ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఐఐసీ అధికారి భూపతి మహంతి, సిబ్బంది కళాశాలలో గురువారం విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులను నిందితులుగా గుర్తించి, అరెస్ట్‌ చేశారు. వీరిలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న అభిషేక్‌ నాయక్, బబులా పండా, మరో ముగ్గురు మైనర్లు ఉన్నారని ఐఐసీ వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement