
గుంటూరు, సాక్షి: ఏపీలో అక్రమ కేసులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కార్యకర్తలే కాదు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన కూడా కుట్రపూరితంగా కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో..
.. ఇంటూరి రవికిరణ్‌పై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన్ని స్టేషన్లు మారుస్తూ వేధిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిని శారీరకంగానూ హింసించి.. జైలు పాలు చేశారు. చివరికి.. తనకు నచ్చినట్లుగా సినిమా తీసే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను చంద్రబాబు ప్రభుత్వం వదల్లేదు. ఈ క్రమంలో..
.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుముతున్న పాలకులపై వైఎస్సార్‌సీపీ పోరాడుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ.. న్యాయ సహాయం అందిస్తోంది. అంతేకాదు.. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై ప్రయివేటు కేసులు పెడతామని ఇదివరకే హెచ్చరించింది కూడా.
‘‘ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్ చేయండి. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది’’
:::వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment