legal aid offer
-
YSRCP: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా..
గుంటూరు, సాక్షి: ఏపీలో అక్రమ కేసులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కార్యకర్తలే కాదు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన కూడా కుట్రపూరితంగా కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో.... ఇంటూరి రవికిరణ్‌పై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన్ని స్టేషన్లు మారుస్తూ వేధిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిని శారీరకంగానూ హింసించి.. జైలు పాలు చేశారు. చివరికి.. తనకు నచ్చినట్లుగా సినిమా తీసే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను చంద్రబాబు ప్రభుత్వం వదల్లేదు. ఈ క్రమంలో.... ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుముతున్న పాలకులపై వైఎస్సార్సీపీ పోరాడుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ.. న్యాయ సహాయం అందిస్తోంది. అంతేకాదు.. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై ప్రయివేటు కేసులు పెడతామని ఇదివరకే హెచ్చరించింది కూడా.‘‘ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. 9440284455, 9963425526, 9912205535 ఈ నంబర్లకు ఫోన్ చేయండి. మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది’’:::వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ధైర్యం పలికిన పేరు... దేవాన్షి! ఆమె ఒక సైన్యంలా..!
పద్నాలుగు సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవాన్షీ యాదవ్. తాను బాధితురాలిగా ఉన్నప్పుడు ఒంటరి. ఇప్పుడు మాత్రం తానే ఒక సైన్యం. ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సోసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి న్యాయసహాయం అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు బాధితుల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్షి గురించి... కష్టాలన్నీ కలిసికట్టుగా వచ్చాయా! అన్నట్లుగా దేవాన్షీ యాదవ్ నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ స్నేహితుడిగా భావించే ఒకడు లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు మాత్రం దేవాన్షినే బోనులో నిలబెట్టారు. ‘మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా’ లాంటి మాటలు తనను ఎంతో బాధ పెట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి చెందిన 31 సంవత్సరాల దేవాన్షి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కష్టాలెన్నో కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తు చేసుకుంటూ బాధను గుండెలో పెట్టుకోలేదు. తనలాంటి కష్టాలు వచ్చిన వారికి అండగా నిలబడాలనుకుంది. అలా మొదలైందే ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ. లైంగిక వేధింపులకు గురవుతున్న వారి నుంచి గృహహింస బాధితుల వరకు ఎంతోమందికి ఈ సంస్థ తరపున అండగా నిలబడింది దేవాన్షి. ‘ధైర్యసాహసాలలో మా అమ్మే నాకు స్ఫూర్తి. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఒకవైపు భర్త చనిపోయిన బాధ, మరోవైపు బిడ్డను ఎలా పోషించాలనే బాధ, అయోమయం ఆమెను చుట్టుముట్టాయి. ఆరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. జీవితంలో ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్లింది. తల్లిగా ప్రేమానురాగాలను పంచడమే కాదు ధైర్యం అనే విలువైన బహుమతిని ఇచ్చింది’ అంటుంది దేవాన్షి. భారమైన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి, శక్తిమంతం కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు దేవాన్షికి ఎంతో ఉపయోగపడ్డాయి. దేవాన్షి దగ్గరకు సహాయం కోసం వచ్చే బాధితుల్లో ఏ కోశానా ధైర్యం కనిపించదు. అలాంటి వారిలో ధైర్యం నింపడం అనేది తాను చేసే మొదటి పని. తనని కుటుంబ సభ్యురాలిగా భావించుకునేలా ఆత్మీయంగా ఉండడం రెండో పని. కౌన్సెలింగ్ ద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశ రేకెత్తించడం మూడోపని. ‘ఈ సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. నాకు ఎవరూ అండగా లేరు’ అనుకున్న ఎంతోమందికి ‘నాకు ఎవరి అండా అక్కర్లేదు. ఒంటరిగా పోరాడగలను. నా కోసం నేను పోరాడలేనా!’ అనే ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇంకేముంది నా భవిష్యత్ బుగ్గిపాలు అయింది’ అని జీవనాసక్తి కోల్పోయిన వారిలో ‘కష్టాలు నీ ఒక్కరికే కాదు. అందరికీ వస్తాయి. అదిగో నీ భవిష్యత్’ అంటూ ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది. ‘పదా... పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం’ అని దేవాన్షి అన్నప్పుడు... ‘అమ్మో! నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం’ అన్నది ఒక బాధితురాలు. ‘తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పూ చేయని నువ్వెందుకు భయపడడం’ అని దేవాన్షి అనగానే ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో! సంస్థ అడుగులు మొదలుపెట్టిన కొత్తలో... ‘మీవల్ల ఏమవుతుంది’ అన్నట్లుగా ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడేవారు. వారికి తన పనితీరుతోనే సమాధానం ఇచ్చింది దేవాన్షి. ‘దేవాన్షీ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నేను దేవాన్షి దగ్గరకు వచ్చాను. ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు దేవాన్షిని బెదిరించడానికి వీధిరౌడీలను పంపించారు. ఆమె ధైర్యాన్ని చూసి వారు తోక ముడవడానికి ఎంతో సమయం పట్టలేదు’ అంటుంది బరేలీకి చెందిన రత్న. బరేలీ పట్టణానికి చెందిన వారే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు దేవాన్షి సహాయం కోసం రావడం ప్రారంభించారు. ‘మా దగ్గరకు వచ్చేవాళ్లలో 60 నుంచి 70 శాతం గృహహింస బాధితులే. వారికి అండగా నిలిచినప్పుడు సహజంగానే బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే నేను వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. మీకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఒకప్పుడు నేను మీలాగే భయపడేదాన్ని... అంటూ నాకు ఎదురైన చేదు అనుభవాలను వారితో పంచుకుంటాను. అమ్మ నుంచి ధైర్యం ఎలా పొందానో చెబుతాను. ధైర్యం అనేది ఒకరు దయతో ఇచ్చేది కాదు. అది అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని చెబుతుంటాను’ అంటుంది దేవాన్షీ యాదవ్. ‘అత్తింటి బాధలు తట్టుకోలేక బయటికి వచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా బతకగలను’ అని దిక్కులు చూస్తున్న ఎంతోమందికి సంస్థ ద్వారా దిక్కు చూపించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుపడింది. ‘మంచిపని చేస్తే ఆ ఫలితం తాలూకు ఆనందమే కాదు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి మరిన్ని మంచిపనులు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అంటుంది దేవాన్షీ యాదవ్. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
ఆ ఎనిమిది మంది డిటెన్షన్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. యూఎస్ పోలీసుల అదుపులో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల తరఫున వాదనలు వినిపించేందుకు గాను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్ ఐసీఈ (స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్) అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు. యూఎస్ ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్ ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముం దని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది. త్వరగా విడుదలయ్యేలా కృషి.. ‘డిటెన్షన్ సెంటర్లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నాం. మా సంస్థ తరపున ఎడ్వర్డ్ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించాం. మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఫణీంద్రకు బెయిల్ రావడం శుభసూచకం. వచ్చే వారం సెకండ్ ట్రయల్ ఉంటుంది. ఫణీంద్ర తరహాలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందిస్తాం..’ –వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి అది తప్పని వారికి తెలుసు వాషింగ్టన్: నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. ‘ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు’హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) విచారం వ్యక్తం చేసింది. 117 మందికి సాయం.. ఫార్మింగ్టన్ వర్సిటీ కేసులో అరెస్టయిన 129 మంది భారత విద్యార్థుల్లో 117 మందికి దౌత్య, న్యాయపర సాయం చేసేందుకు అనుమతి లభించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. విద్యార్థుల నిర్బంధం పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 36 జైళ్లను సందర్శించి 117 మంది విద్యార్థులకు దౌత్యసాయం చేసేందుకు అనుమతులు సంపాదించామని, మిగిలిన 12 మంది కూడా సాయం చేసేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయని చెప్పింది. -
ఒవైసీ ఆఫర్‌ను తిరస్కరించిన ఐఎస్ నిందితులు
ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్నారన్న అనుమానంతో అరెస్టయిన నిందితులకు న్యాయ సహాయం అందిస్తామంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన ఆఫర్‌ను నిందితుల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. మజ్లిస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, ఇతర పార్టీలతో పాటు ఇది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పెట్టిన తప్పుడు కేసును వాడుకుంటోందని ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇలియాస్ యజ్దానీ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కొన్నిరోజుల క్రితం దాఖలు చేసిన మరో పిటిషన్లో వాళ్లు తమకు కోటిరూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, మతం పేరుతో ఓట్లు పోగేసుకోడానికి ప్రయత్నిస్తోందని యజ్దానీ కుటుంబ సభ్యులు నదీరా, మహ్మద్ ఇషాక్ యజ్దానీలు తమ పిటిషన్లో తెలిపారు. వాళ్లు దేశంలోని ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఎన్ఐఏ, హోం మంత్రిత్వశాఖ, తెలంగాణ డీజీపీ, తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. వీళ్లంతా తప్పుడు కేసులు పెట్టి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.