నాందేవ్‌వాడలోని బీసీ హాస్టల్
నిజామాబాద్, నాగారం : జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. నాందేవ్‌వాడలోని బీసీ హాస్టల్‌లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధించడంతో వారిపై కేసు నమోదైంది. నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు బీసీ వసతిగృహంలో వసతి పొందుతున్నారు. అయితే, కొంద రు డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు జూనియర్లను తరచూ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి.
గిరిరాజ్ కాలేజ్, నిశిత డిగ్రీ కాలేజ్‌లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు వినోద్, శ్రీకాంత్, రాజు, ప్రీతమ్ కొన్నాళ్లుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నా రు. సెకండియర్ విద్యార్థులను పిలిచి వారిని వేధిస్తున్నారు. హాస్టల్‌లో ఉన్న మూత్రశాలలు, మరు గుదొడ్లు శుభ్రం చేయాలని, సీనియర్లు తిన్న ప్లేట్లను కడగాలని వేధిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని జూనియర్లు తెలిపారు.
వేధింపులు మరీ ఎక్కువ కావడంతో చివరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విష యం తెలిసిన హాస్టల్ వార్డెన్ బాలకృష్ణ విద్యార్థులను వెంట బెట్టుకొని ఆదివారం మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదు పులోకి తీసుకున్నారు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
చెప్పినా మార్పు రాలేదు..
ర్యాగింగ్ జరుగుతున్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. రాత్రుల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ విద్యార్థులకు శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. అందుకే జూనియర్లతో కలిసి 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం.
– బాలకృష్ణ, వార్డెన్
బెదిరించే వారు..
డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు సెకండియర్ విద్యార్థులను ర్యాగిం గ్ చేస్తున్నారు. రోజూ మూత్రశాలలు కడిగించడం, మరుగుదొడ్లు కడిగించడం వంటివి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేధించవద్దని ఎన్నిసార్లు కోరినా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని వార్డెన్‌కు చెప్పాం. వార్డెన్ ముందే మాపై దాడి చేశారు. హాస్టల్‌లో ర్యాగింగ్ జరగకుండా చూడాలి.
– నరేశ్, డిగ్రీ సెకండియర్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment