విద్యార్థిని మృతి కేసులో ఇంగ్లిష్ టీచర్ సస్పెన్షన్ | The student's death case in English teacher suspension | Sakshi
Sakshi News home page

విద్యార్థిని మృతి కేసులో ఇంగ్లిష్ టీచర్ సస్పెన్షన్

Published Wed, Dec 10 2014 2:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:40 PM

The student's death case in English teacher  suspension

మచిలీపట్నం : చల్లపల్లి మండలం వక్కలగడ్డ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని మృతి కేసులో నిందితుడైన ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు చిరువోలు జనార్దనప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం డీఈవో కె.నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. వక్కలగడ్డ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు మలుపెద్ది శివరామప్రసాద్‌తో కలిసి చిరువోలు జనార్దనప్రసాద్ బాలికను లోబర్చుకుని ఆమె మృతికి కారణమయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం వక్కలగడ్డ పాఠశాలలో పనిచేస్తున్న జనార్దనప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement