Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Yellow Media1
వాస్తవానికి అతకని పచ్చరాతలు!

‘వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం.. మొదటి స్థానంలో తమిళనాడు! తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం పైపైకి..’ ఇది తెలుగుదేశం పత్రిక ఈనాడులో పతాక శీర్షికన వచ్చిన కథనం. ఈ కథనాల ప్రకారం వృద్ధిరేటులో ఏపీ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 14వ స్థానంలో ఉంది! అంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉన్నట్లే కదా? ఆ వెనుకబాటు గురించి తెలంగాణలోనూ ప్రచురించాలి కదా? వారి టీవీలలో ప్రసారం చేయాలి కదా!.కానీ, తెలంగాణ ఎడిషన్లలో ఈనాడు, తదితర ఎల్లో మీడియా పత్రికలు అసలు ఆ కథనాలే ఇవ్వలేదు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్ అనుకోవాలా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారా? లేక ఎల్లో మీడియా వ్యాపార ప్రయోజనాలు తెలంగాణలో అధికంగా ఉన్నాయి కనుక ఆ తరహా వార్తలు ఇచ్చి ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించరాదని? లేక అసలు ఈ వృద్ధి రేటు లెక్కలన్నీ కాకి లెక్కలని తెలుసు కనుకనా?. ఏపీలో తాము భజన చేస్తున్న చంద్రబాబు సర్కారుకు మేలు చేయాలనా? అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇంకో కారణం కూడా ఉండవచ్చు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఏపీలో బాగా పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ,ఇతర వ్యాపారాలను హైప్ చేయడానికి కూడా ఇది ఒక మార్గం కావచ్చు.జగన్ టైమ్‌లో కేంద్రం ఏపీకి ఏదైనా మంచి ర్యాంకు ఇస్తే ఒక్క ముక్క రాయకపోగా, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఈ ఎల్లో మీడియా ఇప్పుడు మాత్రం బ్యానర్‌ కథనాలు వండివార్చి ప్రజలను మోసం చేస్తోంది. వాస్తవంగా వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండి ఉంటే ఎవరూ తప్పుపట్టరు. కానీ, క్షేత్ర స్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీలు ఇచ్చినా జనం నమ్ముతారా? ఈ కథనాలు రావడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై కామెంట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్ది జరిగిపోతోందని సంబరపడిపోవడం చూడడానికి బాగానే అనిపించవచ్చు. నిజానికి ఈ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేవే. కేవలం ముందస్తు అంచనాలు. ఏ స్వతంత్ర సంస్థ వీటిని ధృవీకరించలేదు. ఈ లెక్కలను అనేక ఇతర రాష్ట్రాలు ఇంకా కేంద్రానికి పంపలేదు కూడా. నిజంగా ఎల్లో మీడియా వార్తలు చదివితే ఈ పది నెలల కాలంలో ఏపీ ఇంతగా అభివృద్ధి చెందిందా? అన్న డౌటు రావచ్చు.తలసరి ఆదాయం పెరిగిపోతే ప్రజలు తమకు స్కీములు ఏవీ ఇవ్వక పోవడంపై ఎందుకు గగ్గోలు పెడుతున్నారు?. దానికి వీరెవ్వరూ సమాధానం ఇవ్వరు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ డబ్బులు ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అసత్యాలు చెబుతున్నారా?. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా తనకు సూపర్ సిక్స్ హామీల అమలు కష్టంగా ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పులు చేయబోనని, సంపద సృష్టిస్తానని ఊదరగొట్టిన బాబు ఇప్పుడేమో రికార్డు స్థాయిలో అప్పులు చేశారు. ఒక ఏడాదిలో అమరావతి అప్పులతో సహా సుమారు రూ.1.5 లక్షల కోట్లు చేస్తుండడం దేశంలో మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అయినా వృద్ధిరేటు అధికంగా ఉందంటే ఎలా నమ్మాలి?.ఇక్కడ మరో కోణం చూద్దాం. మొదటి పది నెలల్లో ప్రభుత్వం ఆశించిన ఆదాయంలో 33 శాతం తగ్గుదల ఉంది. మూలధన వ్యయంలో 48 శాతం తగ్గుదల నమోదైంది. అయినా వృద్ధిరేటు మాత్రం 2023-24లో 6.19 శాతం ఉంటే, 2024-25లో 8.21 శాతంగా ఉందని గణాంకాలు తయారు చేశారు. తలసరి ఆదాయం వృద్ధిలోనూ పైపైకి వెళ్లిందని రాశారు. అయితే ఏ రకంగా, ఏ కారణం వల్ల ప్రజల ఆదాయం పెరిగిందన్న వివరణ మాత్రం వీరివ్వరు. ఆదాయం నిజంగా పెరిగి ఉంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లు, ఆస్తుల లావాదేవీలపై ఖర్చు చేస్తారు. చిత్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం అంతకుముందు సంవత్సరంలో పోల్చితే రూ.800 కోట్లు తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు కూడా ఆశించిన రీతిలో వసూలు కావడం లేదు. అయితే ఒక మద్యంలో మాత్రం ఆదాయం వస్తుండ వచ్చు. ప్రజలను తాగుబోతులుగా మార్చడం ద్వారా వృద్ధి రేటు వచ్చిందని ప్రభుత్వం చెప్పదలిస్తే మనం ఏమీ చెప్పలేం. కానీ, వృద్ధి రేటు ద్వారా పేద ప్రజల ఆర్థిక స్థితి గతులు మెరుగుపడాలి. వారి జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ స్కీములు ఉపయోగపడతాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు అన్ని సంక్షేమ హామీలు అమలు అయ్యాయి. అందువల్ల అప్పట్లో తలసరి ఆదాయం పెరగడం, పేదరికం తగ్గుముఖం పట్టడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్‌ మోతాదు వెయ్యి రూపాయలు పెంచడం మినహా సూపర్ సిక్స్, ఇతర హమీలేవీ అమలు చేయలేదు. అయినా తలసరి ఆదాయం పెరిగిందటున్నారు. రియల్ ఎస్టేట్ ఊపందుకుందని కథనాలు ఇస్తున్నారు. అమరావతితో సహా రాష్ట్రంలో ఏ నగరం, పట్టణంలోనూ భూముల విలువలు పెరగలేదు. కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగడం లేదని చాలామంది చెబుతున్నారు.కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం మొదలైన పట్టణాలలో ధరలు సగానికి సగం పడిపోయాయి. పోనీ అమరావతిలో వేల కోట్లు వ్యయం చేస్తున్నందున అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందా అంటే చెప్పుకోదగిన స్థాయిలో లేవని అంటున్నారు. ప్రభుత్వం అచ్చంగా అమరావతిలోనే రియల్ ఎస్టేట్ పెరగాలని భావిస్తున్నందున విశాఖతో సహా ఇతర నగరాలలో పరిస్థితి దారుణంగా తయారైందని వార్తలు సూచిస్తున్నాయి. రైతులు గిట్టుబాట ధరలు లేక అల్లాడుతున్నారు. అక్వా రైతులకు ట్రంప్ దెబ్బ తగిలింది. ఏ రంగం చూసినా ఆశాజనకంగా పరిస్థితులు కనిపించడం లేదు. జీఎస్డీపీ, వృద్ధి రేటు, తలసరి ఆదాయం వంటి వాటిపై ఇచ్చిన లెక్కలు చూసి ఏపీ ప్రజలు ఆనందపడతారా?. వాస్తవంగా వారి జీవితాలు ఎంత భారంగా గడుస్తున్నాయో వారికి తెలియదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Cm Revanth Reddy Warning To Mlas2
ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్‌ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.సీఎం రేవంత్‌ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ కేటగిరైజేషన్‌పై చర్చ జరిగింది. సీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేల డుమ్మా కొట్టారు. వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు.

Netizens Fully Video Creations On Donald Trump3
అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్‌, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో పలు దేశాలను టార్గెట్‌ చేసి ఇష్టానుసారం భారీగా సుంకాలు వడ్డీస్తున్నారు. దీంతో, ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని పలువురు దేశాధినేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ట్రంప్‌ మాత్రం.. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అటు, అమెరికా సైతం స్థానిక వనరులనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా.. ఫన్నీ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.తాజా ఓ నెటిజన్‌ ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌కు చెందిన వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో ట్రంప్‌, మస్క్‌లు అమెరికా అభివృద్ధి కోసం ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నట్టు ఉంది. ట్రంప్‌ పొలంలో నాట్లు వేస్తూ.. మస్క్‌ చీపురుతో ఊడుస్తున్నట్టుగా, జేడీ వాన్స్‌ షూ తయారు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇలా.. మెల్లగా పనులు చేస్తే ఎప్పటికి అమెరికా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఫన్నీ కామెంట్స్‌ పెట్టారు.A couple new characters introduced in this one. pic.twitter.com/8lO3IaIiFA— MAGA Cult Slayer🦅🇺🇸 (@MAGACult2) April 13, 2025మరో నెటిజన్‌ ట్రంప్‌, జిన్‌పింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో చైనా టారిఫ్‌ల దెబ్బకు ట్రంప్‌ విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది.Trump opens a portal to the Upside Down and finds Xi waiting with a 125% tariff in this Stranger Things parody gone full trade war chaos 😱🌀📉💼🔥👔😂 #StrangerTariffs #UpsideDownEconomics #TrumpVsXi #TradeWarParody #StrangerThingsSpoof #MadeInChina #PoliticalParody… pic.twitter.com/zVmr8jchMB— Julius Dein (@JuliusDein) April 11, 2025 Who wore their tariff best? 💃📉🔥 Watch as world leaders strut their stuff in the most ridiculous outfits, proudly flexing their import taxes like it’s Paris Fashion Week for sanctions. 🇺🇸🇨🇳👠 #TariffFashionShow #GlobalDrip #Sanction #CustomsCouture #TradeWarLooks #china… pic.twitter.com/jpxmnmwl9w— Julius Dein (@JuliusDein) April 3, 2025 Trump’s MAGA hat says “Made in China 🇨🇳🧢 and Xi’s somewhere in Beijing cackling like he just won the trade war 😂🤡 #MakeAmericaManufactureAgain #TradeWar #MAGAhat #PoliticalSatire #XiLaughsLast #ManufacturingIrony #MadeInChina #USA🇺🇸 #GlobalLOL pic.twitter.com/3zOSPDR5ax— Julius Dein (@JuliusDein) April 11, 2025Trump and Elon Musk mocked in new AI video showing them as factory workers. pic.twitter.com/wAEXcmlYOK— Daily Mail Online (@MailOnline) April 10, 2025In 2025, AI surpasses all expectations, enabling thousands to become more creative, something that Trump certainly did not anticipate.😂 pic.twitter.com/NTbnGzp8LB— Johannes Maria (@luo_yuehan) April 12, 2025

IPL 2025 PBKS vs KKR Not Playing As A Bowler Drop Him: Aakash Chopra to PBKS4
PBKS vs KKR: బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!

ఐపీఎల్‌-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (PBKS vs KKR)తో మ్యాచ్‌ సందర్భంగా పంజాబ్‌ కింగ్స్‌ తమ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై వేటు వేయాలని సూచించాడు. అతడి స్థానంలో మరో బ్యాటర్‌ను ఎంపిక చేసుకుంటే శ్రేయస్‌ సేనకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.మూడు గెలిచిన పంజాబ్‌కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025) మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ ఆస్ట్రేలియా స్టార్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (Glenn Maxwell)ను రూ. 4.20 ​కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 34 పరుగులు చేశాడు. చివరగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు చేసిన స్కోరు 3.ఇక స్పిన్‌ బౌలింగ్‌ చేయగల మాక్సీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌-2025లో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌.. మంగళవారం కేకేఆర్‌తో ముల్లన్‌పూర్‌ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాక్స్‌వెల్‌ను జట్టు నుంచి తొలగించాలని పంజాబ్‌ నాయకత్వ బృందానికి సూచన ఇచ్చాడు.‘‘గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్‌) పంజాబ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, నేహాల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌.. మార్కస్‌ స్టొయినిస్‌.. అంతా అద్భుతంగా ఆడారు. కానీ మాక్సీ సంగతేంటి?..బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించండి. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను బ్యాటర్‌గా మీరు ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకుంటున్నారు. బౌలర్‌గా అతడికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ అతడు ఏం చేస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టు నుంచి తప్పిస్తే మరొక బ్యాటర్‌కు అవకాశం దక్కుతుంది.అతడు బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. నేను కూడా ఒప్పుకొంటాను. మాక్సీ రూపంలో మీకు ఆఫ్‌ స్పిన్నర్‌ దొరికాడు. ఇక కేకేఆర్‌లో మీకు నలుగురు లెఫ్టాండర్లు కనిపిస్తున్నారు. సునిల్‌ నరైన్‌, క్వింటన్‌ డికాక్‌, వెంకటేశ్‌ అయ్యర్, రింకూ సింగ్‌.. వీళ్ల కోసం మీరు మాక్సీని ఆడించాలని చూస్తారు.దయచేసి పరుగులు సాధించవయ్యాకానీ అతడు బ్యాట్‌తో రాణించకపోతే ఫలితం ఉండదు. కేకేఆర్‌ స్పిన్నర్లను మాక్సీ ఎదుర్కోలేడు. ఏదేమైనా మాక్స్‌వెల్‌ సాబ్‌.. నువ్వు గనుక తుదిజట్టులో ఉంటే.. దయచేసి పరుగులు సాధించవయ్యా.. చేతులు జోడించి అర్థిస్తున్నా’’ అంటూ ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ చానెల్‌లో తనదైన శైలిలో మాక్సీ గురించి కామెంట్స్‌ చేశాడు.శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో సరికొత్త ఉత్సాహంతోకాగా గత సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన పంజాబ్‌.. తొమ్మిదో స్థానంతో ముగించింది. అయితే, ఈసారి మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు టీమిండియా స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను సొంతం చేసుకుని.. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక పంజాబ్‌ సారథిగా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న శ్రేయస్‌.. బ్యాటర్‌గానూ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ ఆడి 250 పరుగులు సాధించాడు.చదవండి: కెప్టెన్‌గా అది పంత్‌ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిమాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..

Congress Leaders Counter On Kotha Prabhakar Reddy Comments5
‘కొత్త’ వ్యాఖ్యలతో పొలిటికల్‌ వార్‌.. కాంగ్రెస్‌ రియాక్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసుగుచెందరని.. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.అధికార దాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు.. మంత్రి పొంగులేటికాంగ్రెస్‌ పాలన వచ్చినప్పటి నుంచి కూలుస్తామంటున్నారు.. అధికారదాహంతో బీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూ భారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారు. భూ భారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టినవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసీఆర్‌ ఆత్మ కొత్త ప్రభాకర్‌రెడ్డి. కేసీఆర్‌ సూచన మేరకే ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అధికారంలోకి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. భూ భారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.కేసు బుక్‌ చేయాలి.. ఆది శ్రీనివాస్‌కొత్త ప్రభాకర్‌రెడ్డి వాఖ్యలు సీరియస్‌గా పరిగణించాలంటూ ప్రభుత్వ విప్‌, వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కేసు బుక్ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తా. సంక్షేమం ప్రజలకు అందుతుందనే బీఆర్ఎస్ కుట్ర చేస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

White House responds Over China rare earth limits6
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్‌ ప్లాన్‌తో టెన్షన్‌లో ట్రంప్‌!

వాషింగ్టన్‌: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్‌ స్పందించారు.తాజాగా ట్రంప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్‌ హసెట్‌ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.The chart shows how much the US relies on imports for rare earth metals, what they are used for, and how much of the imports come from China. A good one from JPM-AM. pic.twitter.com/xQalD5ZyH7— Ayesha Tariq, CFA (@AyeshaTariq) April 14, 2025మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్‌ నిలిపివేసింది. దీంతో, ట్రంప్‌ సర్కార్‌కు ఊహించని షాక్‌ తగిలింది.BREAKING: Trump Administration’s Kevin Hassett says he’s “100 percent not expecting a recession.”He claims that job numbers are through the roof as the reason why.Does he not realize that Job numbers are from the month of March and Tariffs started in the beginning of April?… pic.twitter.com/DjXuC1vfT9— Ed Krassenstein (@EdKrassen) April 14, 2025ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

Orry Reveals Weight Loss Secret Experts Warning Such Practices7
వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?

స్మార్ట్‌గా..అందంగా కనిపించడం అనేది మోడళ్లు, సినీతారలు ప్రముఖులకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్‌ మీడియా పుణ్యమా అని ఓవర్‌నైట్‌ స్టార్‌లుగా మారుతున్న వాళ్లు సైతం అదే బాటపడుతున్నారు. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఏం సమస్య లేదు. తక్కువ సమయంలో సన్నగా మారిపోవాలనుకుంటేనే.. ఆరోగ్యమే చిక్కుల్లో పడుతుంది. చాలామంది ఏదీఏమైనా పర్లేదు అంటూ రిస్క్‌ చేసి మరీ తప్పుడు డైటింగ్‌ పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకోసం శరీరాన్ని ఎంతలా కష్టపెడుతున్నారంటే..కేవలం వర్కౌట్‌లు కాదు, ఆహారం పరంగా శరీరం శుష్కించిపోయేలా చేస్తున్నారు. అవి వింటే.. బరువు తగ్గడం కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. ఆకృతికి ఇంత ప్రాముఖ్యత..? అనిపిస్తుంది కూడా. ఒర్రిగా ప్రసిద్ధిచెందిన కంటెంట్‌ క్రియేటర్‌ సైతం ఇలాంటి పనులే చేసి బరువు తగ్గాడట. అతడు బరువు తగ్గే క్రమంలో అనుసరించిన విధానాలు తెలిస్తే..నిజంగానే వాంతి చేసుకున్న ఫీలింగ్‌ వచ్చేస్తుంది. అందులో నో డౌట్‌.ఒర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి అనే కంటెంట్‌ క్రియేటర్‌ 2023 ప్రారంభం వరకు 70 కిలోల బరువుతో ఉండేవాడు. చూడటానికి కొద్దిగా లావుగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఫేమస్‌ కావడంతో టీవీ షోల్లో కనిపించేందుకు స్మార్ట్‌గా ఉండక తప్పదు. అందుకోసం అతను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకునేవాడట. అలా చేసుకుంటే కాసేపటి వరకు వాంతి వస్తున్న ఫీలింగే ఉండి.. తిన్న ఆహారం అంతా బయటకొచ్చేస్తుంది. తద్వారా నీరసించి బరవు తగ్గేవాడట. అలా వాంతులు చేసుకుని చివరకు టాయిలెట్‌లో నిద్రపోయేవాడట. దాంతో మెడనొప్పితో ఇబ్బందిపడేవాడినంటూ తన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎలా మొదలయ్యాయో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో. బరువు తగ్గడం కోసం ఓజెంపిక్‌ లాంటి మందులు వాడొచ్చు. అయితే అది ఛీటింగ్‌ అవుతుందే తప్ప బరవుతగ్గడం కాదనే నమ్ముతా అంటున్నాడు ఒర్రీ. అయితే తన దృష్టిలో బరువు తగ్గడానికి అదే బెస్ట్‌ అని కితాబిస్తున్నాడు. కాగా, ఒర్రీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేయడమే గాక . ఓ సామాజిక కార్యకర్త కూడా. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా సెలబ్రిటీల పార్టీల్లో మెరుస్తుంటాడు. అలాగే బాలీవుడ్‌ టీవీ షోల్లో తళ్లుకుమంటుంటాడు. ఎంత ప్రమాకరమైనదంటే..తనను తాను ఆకలితో అలమటింపచేసుకునేలా పదేపదే వాంతులు చేసుకోవడం అనే ప్రక్రియ అత్యంత హానికరమైనదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శారీరకంగా మానసికంగా అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణశయాంతర సమస్యలు, గుండెకు సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అంతేగాదు ఆకలి శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలను బలహీనపరిచి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని అన్నారు. కెరీర్‌లో విజయం సాధించడానికి ఎలా షార్ట్‌కట్‌లు ఉండవో అలాగే బరువు తగ్గడంలో కూడా ఉండవని తేల్చి చెబుతున్నారు. ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సన్నగా మార్చినప్పటికీ..రాను రాను చిరాకు, ఒత్తిడి, వంటి వాటికిలోనై మొత్తం శరీరం పనితీరుపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని వార్నింగ్‌ ఇస్తున్నారు నిపుణులు. అందువల్ల ఇలాంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తూ..ఆరోగ్యప్రదంగా బరువు తగ్గే వాటిని అనుసరిస్తే అన్ని విధాల మేలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఇదేం ఫిట్‌నెస్‌ స్టంట్‌..? తిట్టిపోస్తున్న నెటిజన్లు)

ED Office Summoned Notices To Robert Vadra8
ఈడీ విచారణకు రాబర్ట్‌ వాద్రా.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో టెన్షన్‌

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు బిగ్‌ షాక్‌ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు ​​పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case, alleges 'political vendetta'.He says, "Whenever I will speak up for people and make them heard, they will try to suppress me... I… pic.twitter.com/mRrRZedq6l— ANI (@ANI) April 15, 2025ఇదిలా ఉండగా.. రాబర్ట్‌ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్‌ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.

Movie Director Laxman Utekar Life Story9
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్‌

చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్‌ మోడల్‌ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్‌లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్‌గా స్టార్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్‌కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్‌ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్‌ క్లీన్‌ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్‌ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు 2007లో ఖన్నా & అయ్యర్‌ సినిమాతో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా ఛాన్స్‌ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్‌ కోసం కూడా వర్క్‌చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్‌లో మరింత పాపులర్‌ అయ్యాడు. అయితే, రీసెంట్‌గా ఛావా సినిమాతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్‌ చాటాడు. అలా వడాపావ్‌ బండి నుంచి బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్‌ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

US Freezes 2 2 Billion Funding for Harvard after University Defies10
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్‌ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్‌

వాషింగ్టన్‌ డీసీ: ట్రంప్‌ సర్కారు హార్వాడ్‌ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్‌ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్‌ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్‌ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్‌ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్‌ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్‌ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement