
బంజారాహిల్స్: సినీనటుడు అల్లు శిరీష్ టీచర్ అవతారం ఎత్తాడు. పెగా టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ తరగతులు బోధిస్తోంది. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో ఆయా స్కూళ్లలో పాఠాలు చెప్పిస్తుంటారు. ఇలా శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4,5 తరగతి విద్యార్థులకు అల్లు శిరీష్ గెస్ట్ టీచర్‌గా రెండు గంటల పాఠాలు బోధించాడు. విద్యార్థులకు సరదాగా ప్రశ్నలు వేస్తూ ఆంగ్లంలో సమాధానలు రాబట్టాడు. అనంతరం చిన్నారులు శిరీష్‌తో ఫొటోలు దిగారు. అతడు మాట్లాడుతూ.. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజని, పిల్లలకు తాను పాఠం చెప్పడం అద్భుతంగా ఉందన్నాడు. తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment