
ప్రాణం తీసిన అధిక వడ్డీ
బిజినేపల్లి: వడ్డీ వ్యాపారి దాష్టీకానికి ఓ యువకుని ప్రాణం బలైంది.. చేసిన అప్పునకు అధిక వడ్డీ చెల్లించలేక ఉన్న ఇంటి స్థ లం అక్రమంగా లాక్కోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకా రం... మండలంలోని మం గనూరుకు చెందిన గడ్డపార సతీష్ (32) పీజీ వర కు చదువుకుని స్థాని కంగా ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య మహేశ్వరితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆర్థిక ఇబ్బం దులు ఎదురవటంతో బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఏడాదిన్నర క్రితం రూ.లక్ష అప్పు తీసుకున్నాడు.
మంగనూర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలను స్థాపించి రోజుకు రూ.వెయ్యి వడ్డీ చొప్పున 45 రోజుల్లో రూ.45వేలు చెల్లించాడు. సకాలంలో అధిక వడ్డీకి అప్పు తీర్చలేక పాఠశాల మూతపడి పొట్టచేతపట్టుకుని ఏడాదిక్రితం హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. మూడు నెలలక్రితం స్వగ్రామానికి తిరిగిరాగా తన కున్న 142 గజాల ఇంటి స్థలాన్ని వడ్డీ వ్యాపారి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అం దులో ఉన్న కుందేళ్ల షెడ్ జాలీలు, ఇతరత్రా సామగ్రిని సైతం అప్పు కిందికి వడ్డీ వ్యాపారి లాక్కున్నాడు. దీంతో మనోవేదన కు గురైన సతీష్ సూసైడ్ నోట్ రాసి గురువారం మధ్యాహ్నం బిజినేపల్లిలోని బాలికల జెడ్పీహెచ్‌ఎస్ సమీపంలోకి వచ్చి పురుగుమందు తాగాడు.
ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి ఎస్‌ఐ నరేష్ చేరుకుని బాధితుడిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు, బంధువులు బోరుమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వడ్డీ వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.